టాలీవుడ్‌లో మరోమారు డ్రగ్స్‌ ప్రకంపనలు.. కేపీ చౌదరి లిస్ట్‌లో ఆగ్ర సెలబ్రెటీల చిట్టా..! తీగ లాగితే..

హైదరాబాద్ పోలీసులు ఏర్పాటుచేసిన డ్రగ్ నివారణ సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు హీరో నిఖిల్, హీరో ప్రియదర్శి. గతంలో తనకు సైతం డ్రగ్స్ అమ్మేందుకు కొందరు ప్రయత్నించారని, కానీ తాను ఎక్కడా వారికి లొంగలేదని హీరోనిఖిల్ చెప్పుకొచ్చారు. కొందరి వల్ల మొత్తం ఇండస్ట్రీని అనడం సరి కాదని అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీలో కొంతమంది బాధితులు ఉండవచ్చు ...

టాలీవుడ్‌లో మరోమారు డ్రగ్స్‌ ప్రకంపనలు.. కేపీ చౌదరి లిస్ట్‌లో ఆగ్ర సెలబ్రెటీల చిట్టా..! తీగ లాగితే..
Drugs
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 24, 2023 | 8:45 PM

మరోసారి టాలీవుడ్ డ్రగ్స్ ప్రకంపనలు కలకలం రేపుతుంది. కబాలి నిర్మాత కె.పి చౌదరి రిమాండ్ రిపోర్ట్ లో బయటపడిన సంచలనాలతో ఒక్కసారిగా ఇండస్ట్రీ షేక్‌ అవుతుంది. కేపీ చౌదరి ద్వారా సెలబ్రిటీ డ్రగ్స్ పుట్టను బద్దలు కొట్టారు సైబరాబాద్ పోలీసులు. సామాన్యుల కంటే ఎక్కువగా సెలెబ్రిటీలే డ్రగ్స్ బానిసలుగా ఉన్నట్లు గుర్తించారు. కెపి చౌదరి లిస్టులో సంచలనాలు బయటపడుతున్నాయి. ఒక క్రీడాకారిని ఇంటిని అడ్డగా చేసుకున్నాడు కేపీ చౌదరి. టాలీవుడ్ తారలు సీరియల్ ఆర్టిస్టులు వ్యాపారవేత్తలు రాజకీయ పుత్ర రత్నాలు. ఇలా ఒక సినిమా ఇండస్ట్రీతో కాకుండా అందరితో పరిచయాలు కలిగిన వాడు కేపి చౌదరి.. పేరుకు సినిమా నిర్మాతగా ఉనా, నిరంతరం పబ్ లైఫ్, నైట్ కల్చర్ కు అలవాటుపడ్డాడు కేపీ. నిర్మాతగా… వచ్చిన డబ్బులతో గోవాలోనూ ఒక హోటల్ ఏర్పాటు చేసుకున్నాడు.. అక్కడ నైజీరియాలతో పరిచయం కావటం కేపీ జీవితంలో టర్నింగ్ పాయింట్. గోవా కేంద్రంగా నడుస్తున్న డ్రగ్ మాఫియా లోకి కేపీ ఎంటర్ అయ్యాడు. పార్టీల పేరుతో సెలబ్రిటీలకు ఇన్విటేషన్లు, స్టార్ హోటోలలో పార్టీలు, సినీ తారల నుండి గిఫ్టులు.. ఇదే లైఫ్ స్టైల్ గా అమర్చుకున్నాడు కేపీ.

తీగ లాగితే డొంక కదిలినట్టుగా కెపి హిట్ లిస్ట్ బయటకు వచ్చింది.. అయితే 2016 లోనూ టాలీవుడ్ కి డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నట్టు ప్రకంపనులు బయటపడ్డాయి.. అప్పటి పోలీసులు ఎక్సైజ్ శాఖ వారిని కేవలం బాధితులుగా పరిగణించి క్లీన్ చీట్ ఇచ్చేసింది. ఇదే సినిమా ఇండస్ట్రీకి చెందిన బాలీవుడ్ తారలు గానీ, కోలీవుడ్ తారలు గాని డ్రగ్స్ సేవించి పట్టుబడితే వారిని అరెస్టు చేసిన దాకాలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రం డ్రగ్స్ సేవించిన వారంతా కేవలం బాధితులు మాత్రమే అనేది గతంలో పోలీసులు చెప్పిన మాట…

కట్ చేస్తే ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు సీన్ లోకి ఎంటర్ అయ్యారు. కేపీ చౌదరి కుప్పి లాగింది సైబరాబాద్ పోలీసులే.. సో ఇప్పుడు అందరి దృష్టి సైబరాబాద్ పోలీసులపైనే ఉంది. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేపిస్తున్నారు.. రాజేంద్రనగర్ ఎసిపి ఆధ్వర్యంలో కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. సైబరాబాద్ పరిధిలో ఎక్కువ సంఖ్యలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతో పాటు ఐటీ కారిడార్ కూడా ఉండటంతో డ్రగ్ ఫ్రీ సిటీ పేరుతో ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించారు సైబరాబాద్ పోలీసులు.. ఇప్పుడు కేపీ చౌదరి ఉదంతం బయటపడటంతో పోలీసులు సైతం అవాక్కవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు డ్రగ్స్ ఉదాంతం పై హీరో నిఖిల్ స్పందించారు. హైదరాబాద్ పోలీసులు ఏర్పాటుచేసిన డ్రగ్ నివారణ సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు హీరో నిఖిల్, హీరో ప్రియదర్శి. గతంలో తనకు సైతం డ్రగ్స్ అమ్మేందుకు కొందరు ప్రయత్నించారని, కానీ తాను ఎక్కడా వారికి లొంగలేదని హీరోనిఖిల్ చెప్పుకొచ్చారు. కొందరి వల్ల మొత్తం ఇండస్ట్రీని అనడం సరి కాదని అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీలో కొంతమంది బాధితులు ఉండవచ్చు …అని వారిని సిండికేట్ గా చేసుకొని డ్రగ్స్ అముతున్న వారిని పోలీసులు గుర్తించి పట్టుకోవాలని హీరో నిఖిల్ తెలిపారు

సినీ తారలంటూ ఎటువంటి అపేక్ష లేకుండా వారి పేర్లను డ్రగ్స్ కేసులో పెట్టడంతో సైబరాబాద్ పోలీసుల తీరును ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. డ్రగ్స్ సేవించిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దంటూ నెటీజన్స్ సైబరాబాద్ పోలీసులను కోరుతున్నారు..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ప్రణిత- TV9 ప్రతినిధి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే