మనుషులను సైలెంట్ గా చంపేస్తున్న ఈ వ్యాధి పట్ల జాగ్రత్త..! పరిశోధనలో షాకింగ్ వాస్తవాలు..

అభివృద్ధి చెందిన దేశాల్లో హైపర్‌టెన్షన్‌పై అవగాహన, సకాలంలో చికిత్స ఎక్కువగా ఉందని అధ్యయనం వెల్లడించింది. అధిక రక్తపోటును నివారించడం, గుర్తించడం, చికిత్స చేయడం అన్ని దేశాల్లోని ప్రజలకు సాధ్యమవుతుందని, సులభంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.

మనుషులను సైలెంట్ గా చంపేస్తున్న ఈ వ్యాధి పట్ల జాగ్రత్త..! పరిశోధనలో షాకింగ్ వాస్తవాలు..
Hypertension
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 24, 2023 | 8:00 PM

దేశంలోని కోట్లాది మంది జీవితాలు ఏ క్షణంలోనైనా ప్రమాదంలో పడతాయంటే నమ్ముతారా..? అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే, ఒక్క జబ్బు మనిషి జీవితాన్ని క్షణంలో మార్చేస్తుంది. హైపర్‌టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెజర్ సైలెంట్ కిల్లర్. గత 30 ఏళ్లలో అధిక రక్తపోటు ఉన్నవారిలో సగానికి పైగా ప్రజలు చికిత్స పొందలేదని షాకింగ్ పరిశోధన వెల్లడించింది. కాబట్టి ఈ పరిస్థితి ఎప్పుడైనా ప్రాణాపాయంగా మారుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రక్తపోటు అనేది ఒక సాధారణ సమస్య. దీన్ని సులభంగా నయం చేయవచ్చు. అయితే, ఈ వ్యాధిని సరైన సమయంలో గుర్తించి నియంత్రించాలి. లేకపోతే, పరిణామాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇది స్ట్రోక్, పక్షవాతం, గుండె, మూత్రపిండాల సమస్యలు వంటి తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తుంది.

గత పదేళ్లలో 184 దేశాల్లో 10 మిలియన్లకు పైగా ప్రజలపై జరిపిన అధ్యయనంలో అధిక రక్తపోటు ఉన్నవారిలో సగం మందికి తమ పరిస్థితి గురించి తెలియదని తేలింది. తమ పరిస్థితి గురించి అవగాహన ఉన్న పురుషులు, స్త్రీలలో సగానికి పైగా చికిత్స పొందడం లేదని పరిశోధనలు చెబుతున్నాయి. ఇలా అధిక రక్తపోటు ఉన్న చాలా మంది ప్రజలు చికిత్స తీసుకోకుండానే ఉంటారు. అభివృద్ధి చెందిన దేశాల్లో హైపర్‌టెన్షన్‌పై అవగాహన, సకాలంలో చికిత్స ఎక్కువగా ఉందని అధ్యయనం వెల్లడించింది. అధిక రక్తపోటును నివారించడం, గుర్తించడం, చికిత్స చేయడం అన్ని దేశాల్లోని ప్రజలకు సాధ్యమవుతుందని, సులభంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.

సాధారణ లక్షణాలు ఏమిటి?

అధిక రక్తపోటు ఉన్నవారికి గుండె, ధమనులపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. అధిక రక్తపోటు సాధారణ లక్షణాలు తీవ్రమైన తలనొప్పి, అధిక అలసట, కంటి ఒత్తిడి, ఛాతీ నొప్పి. ఊపిరి ఆడకపోవడం, సక్రమంగా లేని హృదయ స్పందన, మూత్రంలో రక్తం, ఛాతీ, గొంతు లేదా చెవులలో నొప్పి అనుభవించవచ్చు. ఈ లక్షణాలలో ఏవైనా మీకు కనిపిస్తే, వాటిని విస్మరించకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే