Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆశ కోల్పోవద్దు..! ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే.. నాలుగేళ్ల తర్వాత వస్తువు డెలివరీ అయ్యింది..

2019లో మెటీరియల్ ఆర్డర్ చేసినట్టుగానే వస్తువు ప్యాక్ చేయబడింది. కానీ డెలివరీ మాత్రమే సాధ్యం కాలేదు. ఆర్డర్ మెటీరియల్‌ని పొందడానికి కస్టమర్ హెల్ప్‌లైన్, అలీబాబా వెబ్‌సైట్ హెల్ప్ లైన్ నంబర్‌తో సహా అనేక మార్గాల్లో ప్రయత్నించినా లాభం లేకపోయింది. కానీ, అతని ఆశ వమ్ము కాలేదు. ఎట్టకేలకు అతడు ఆర్డర్ చేసిన వస్తువు ఇంటికి చేరింది.

ఆశ కోల్పోవద్దు..! ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే.. నాలుగేళ్ల తర్వాత వస్తువు డెలివరీ అయ్యింది..
Online Shopping
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 24, 2023 | 5:17 PM

డిజిటల్ ఇండియాలో షాపింగ్ మాత్రమే కాదు.. అన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఆహారంతో సహా అన్ని నిమిషాల్లో ఇంటి గుమ్మం వద్దకు చేరుకుంటున్నాయి.. ఆన్‌లైన్ సేవ మెరుపు వేగంతో అందించబడుతుంది. కానీ, ఇక్కడ ఒక వ్యక్తి 2019లో ఆన్‌లైన్‌లో ఓ వస్తువును ఆర్డర్ చేశాడు. కానీ, ఈ వస్తువు డెలివరీ కావడానికి 4 నిమిషాలు, 4 రోజులు కాదు, సరిగ్గా 4 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. ఢిల్లీకి చెందిన సదరు వ్యక్తి తాను ఆర్డర్ చేసిన వస్తువు 4 ఏళ్ల తర్వాత తనకు అందినందుకు సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఢిల్లీకి చెందిన నితిన్ అగర్వాల్ అనే టెక్కీ 2019లో చైనాకు చెందిన అలీబాబా వెబ్‌సైట్ ద్వారా ఈ వస్తువును కొనుగోలు చేశాడు. Ally Express ద్వారా ఆర్డర్ చేశాడు. 2019లో వస్తువు ఆర్డర్ చేసిన నితిన్ అగర్వాల్ డెలివరీ కోసం ఎదురు చూశాడు. కానీ, మెటీరియల్ రాలేదు. నితిన్ ఆర్డర్ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే చైనాకు చెందిన అల్లీ ఎక్స్‌ప్రెస్‌తో సహా అనేక వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ షాపింగ్, యాప్‌లను భారతదేశంలో నిషేధించడమే దీనికి కారణం. కానీ, 2019లో మెటీరియల్ ఆర్డర్ చేసినట్టుగా ప్యాక్ చేయబడింది. ఇదంతా 2019లోనే జరిగింది. కానీ డెలివరీ మాత్రమే సాధ్యం కాలేదు. ఆర్డర్ మెటీరియల్‌ని పొందడానికి కస్టమర్ హెల్ప్‌లైన్, అలీబాబా వెబ్‌సైట్ హెల్ప్ లైన్ నంబర్‌తో సహా అనేక మార్గాల్లో ప్రయత్నించినా లాభం లేకపోయింది. కానీ, అతని ఆశ వమ్ము కాలేదు.

ఇవి కూడా చదవండి

భారతదేశం చైనా యాప్‌పై నిషేధం, వాణిజ్యంపై ఆంక్షలు, నిబంధనలు పెంచాయి. దీంతో సరుకుల రవాణాకు ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత, నితిన్ అగర్వాల్ తన వస్తువును పొందాడు. ఈ విషయాన్ని అగర్వాల్‌ సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆన్‌లైన్‌ ఆర్డర్లపై మీరు కూడా ఆశలు కోల్పోకండి. 2019లో నేను Ally Express (ప్రస్తుతం భారతదేశంలో నిషేధించబడింది) ద్వారా ఆర్డర్ చేశాను. ఇప్పుడే పార్శిల్ డెలివరీ అందిందని క్యాప్షన్‌లో రాశాడు.

మరిన్ని ట్రెండింగ్  న్యూస్ కోసం క్లిక్ చేయండి..