ఆహా.. ఏమి రుచి..! పానీపూరిలు తెగ లాగించేస్తున్న కోతి.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

అయితే, ఇప్పుడు పానీపూరి మనుషులకు మాత్రమే కాదు.. జంతువులకు కూడా తెగ నచ్చుతుంది. అదేంటి జంతువులు పానీపూరి తింటున్నాయా..? అని ఆశ్చర్యపోతున్నారు కదూ..! అవును.. నిజమే.. ఇక్కడ ఒక వానరం కూడా జాలిగా పానీపూరి తింటూ ఎంజాయ్‌ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఆహా.. ఏమి రుచి..! పానీపూరిలు తెగ లాగించేస్తున్న కోతి.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Golgappa
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 24, 2023 | 4:38 PM

పానీపూరి.. పేరు వింటే చాలు.. చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ గోల్‌గప్పాను తినటానికి ఇష్టపడుతుంటారు. రోడ్డుపై ఎక్కడ పానీపూరి బండి కనిపించినా.. జనం అక్కడే వాలిపోతుంటారు. తియ్య తియ్యగా, పుల్ల పుల్లగా ఉండే పానీపూరి తింటూ.. పానీ తాగుతూ స్వర్గపు అంచులదాకా వెళ్లిన ఆనందం పొందుతుంటారు. అయితే, ఇప్పుడు పానీపూరి మనుషులకు మాత్రమే కాదు.. జంతువులకు కూడా తెగ నచ్చుతుంది. అదేంటి జంతువులు పానీపూరి తింటున్నాయా..? అని ఆశ్చర్యపోతున్నారు కదూ..! అవును.. నిజమే.. ఇక్కడ ఒక వానరం కూడా జాలిగా పానీపూరి తింటూ ఎంజాయ్‌ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వైరల్‌ వీడియో గుజరాత్‌లోని టంకారాకు చెందినదిగా తెలిసింది. వీడియోలో ఒక కొండముచ్చు పానీపూరి బండి వద్దకు వచ్చి పానీపూరి తింటుండటం కనిపించింది. ఈ వీడియోలో కొండముచ్చు ఏం చక్కా పానీపూరీలు తింటున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ముందుగా వీడియోలో కొండముచ్చు పానీపూరి బండివద్దకు వచ్చి కూర్చోవడం కనిపించింది. ఆ తర్వాత పానీపూరి బండి యజమానికి దానికి ఒక ప్లేట్‌లో పానీపూర్తి వడ్డించి ఇచ్చాడు. దాంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ కొండముచ్చు ఏం చక్కా గోల్‌గప్పాలు లాగించేస్తుంది.

ఇవి కూడా చదవండి

కొండముచ్చు పానీపూరి తింటుండగా వీడియోలు తీసిన స్థానికులు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు సరదాగా స్పందించారు. కొండముచ్చు మనుషులకంటే బాగా పానీపూరి తింటుందని ఒకరు కామెంట్ చేయగా, కొండముచ్చు పానీపూరి తింటున్న దృశ్యం ఆనందాన్ని కలిగిస్తుందంటూ మరికొందరు కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్  న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్