Bottle Gourd : సొరకాయతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. తెలిస్తే తినకుండా ఉండలేరు..!

ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. మారుతున్న జీవనశైలి కారణంగా, చాలా మంది ప్రజలు ఒత్తిడితో జీవిస్తున్నారు. అధిక స్ట్రెస్‌ కారణంగా అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే సొరకాయ తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని కూడా ఆరోగ్య నిపుణులు చెబుతారు.

Bottle Gourd : సొరకాయతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. తెలిస్తే తినకుండా ఉండలేరు..!
Bottle Gourd
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 26, 2023 | 4:26 PM

Health Tipes: సొరకాయ.. దీనినే కొందరు ఆనపు కాయ అని కూడా అంటారు. చాలా మంది సొరకాయను తినడానికి ఇష్టపడరు. ఇందులో నీటిశాతం ఎక్కువగా ఉండడం వల్ల రుచి అంతగా ఉండదు. కానీ, దీంతో రకరకాలు వంటకాలు తయారు చేసుకుని తినవచ్చు. సొరకాయను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సొరకాయలో విటమిన్లు, తక్కువ కేలరీలు, ఫైబర్, పొటాషియం, మినరల్స్, ప్రొటీన్లు ఉంటాయి. అంతేకాదు.. ఇందులోని నీటిశాతం వల్ల అజీర్ణ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. సొరకాయలో కాలరీలు, పీచుపదార్థాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు ఇది మంచి ఆహారం.

అంతేకాదు.. సొరకాయతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఎందుకంటే ఇందులో కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఎముకలను బలోపేతం చేస్తాయి. ఇంకా గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఉత్తమమైన ఆహారం

సొరకాయలో ఆరోగ్యానికి అవసరమైన మంచి పోషకాలు ఉండటం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి అధిక రక్తపోటును నివారించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. మారుతున్న జీవనశైలి కారణంగా, చాలా మంది ప్రజలు ఒత్తిడితో జీవిస్తున్నారు. అధిక స్ట్రెస్‌ కారణంగా అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే సొరకాయ తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని కూడా ఆరోగ్య నిపుణులు చెబుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..