AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking news: వంతెన కూలి నదిలో పడిపోయిన రైలు.. నీటి సరఫరా నిలిపివేసిన అధికారులు..

మీడియా కథనాల ప్రకారం.. మోంటానాలో రైలు పట్టాలు తప్పడంతో ఎల్లోస్టోన్ నదిపై వంతెన కూలిపోయింది. ఎల్లోస్టోన్ కౌంటీ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రకారం.. ఉదయం 6 గంటలకు రైలు పట్టాలు తప్పింది. రైలులోని చాలా ట్యాంకర్లు దెబ్బతిన్నాయి. అందులోని ట్రోలియం ఉత్పత్తులు కూడా లీక్ అవుతున్నట్లు గుర్తించారు.

Shocking news: వంతెన కూలి నదిలో పడిపోయిన రైలు.. నీటి సరఫరా నిలిపివేసిన అధికారులు..
Train Derailment
Jyothi Gadda
|

Updated on: Jun 26, 2023 | 2:53 PM

Share

నదిపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలడంతో రైలు నదిలో పడిపోయింది. ఈ షాకింగ్‌ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాలోని కొలంబస్‌లో వంతెన కూలడంతో గూడ్స్ రైలు నదిలో పడిపోయింది. గూడ్స్ రైలులో వేడి తారు, సల్ఫర్ వంటి ప్రమాదకరమైన పదార్థాలు ఉన్నాయని తెలిసింది. జరిగిన ప్రమాదంపై రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ.. వేడి తారు, కరిగిన సల్ఫర్‌తో వెళ్తున్న రైలు నదిలో పడిపోయిందని చెప్పారు. అందుకే నదీ జలాల వినియోగం నిషేధించినట్టుగా వెల్లడించారు. రైలు కోపైలట్‌, ఇత్తర సిబ్బంది క్షేమంగా ఉన్నారని చెప్పారు. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైలు సిబ్బంది తెలిపారు.

బిల్లింగ్స్‌కు పశ్చిమాన 40 మైళ్ల (సుమారు 64 కిలోమీటర్లు) దూరంలో ఉన్న కొలంబస్ పట్టణానికి సమీపంలో ఈ నెల 24న రైలు వంతెన కూలిపోయింది. వేడి తారు, కరిగిన సల్ఫర్‌ను తీసుకువెళుతున్న ఏడు రైలు బోగీలు ప్రవహించే నదిలో పడిపోయాయి. ఈ ప్రాంతం ఎల్లోస్టోన్ రివర్ వ్యాలీలో తక్కువ జనాభా కలిగిన విభాగంలో ఉంది. దాని చుట్టూ గడ్డిబీడు, వ్యవసాయ భూములు ఉన్నాయని తెలిసింది. ఇక బ్రిడ్జి కూలిపోవడంతో రాష్ట్ర ప్రజలకు ఇంటర్నెట్ సేవలను అందించే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కూడా తొలగించబడిందని హై-స్పీడ్ ప్రొవైడర్ గ్లోబల్ నెట్ తెలిపింది. నదిపై రైల్వే బ్రిడ్జి కూలిపోవడంతో పాటు కలుషిత నదీజలాలు పొలాల్లోకి వెళ్లకుండా కాలువలోనే నిలిపివేశారు. నదిపై ఉన్న రైల్వే వంతెన కూలిపోవడంపై విచారణ కొనసాగుతోంది. కలుషితమైన నది నీటిని పంట పొలాలకు, ప్రజల అవసరాలకు వినియోగించకుండా కాలువలోనే నిలిపివేశారు.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. మోంటానాలో రైలు పట్టాలు తప్పడంతో ఎల్లోస్టోన్ నదిపై వంతెన కూలిపోయింది. ఎల్లోస్టోన్ కౌంటీ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రకారం.. ఉదయం 6 గంటలకు రైలు పట్టాలు తప్పింది. రైలులోని చాలా ట్యాంకర్లు దెబ్బతిన్నాయి. అందులోని ట్రోలియం ఉత్పత్తులు కూడా లీక్ అవుతున్నట్లు గుర్తించారు. దాంతో వంతున చుట్టు పక్కల ప్రజలను అప్రమత్తం చేశారు. నది సమీపంలోకి రావొద్దని సూచించారు. స్థానికంగా చేపలు పట్టేందుకు కూడా ఎవరూ వెళ్లరాదని హెచ్చరించారు. సమీపంలోని నీటి శుద్ధి ప్లాంట్లు, నీటిపారుదల జిల్లాలు, పారిశ్రామిక సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..