AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ. 20కోట్లకు పైగా ఆస్తి, విలాసవంతమైన బంగ్లాను పిల్లులకు రాసిచ్చిన మహిళ.. కోర్టు జోక్యంతో..

ఒక మహిళ తన రూ.20 కోట్లకు పైగా ఆస్తిని, విలాసవంతమైన బంగ్లాను తన ఏడు పిల్లులకు రాసి ఇచ్చింది. ఈ డిపాజిట్.. క్యాట్ ఫుడ్, ఇతర అవసరాల ఖర్చులను కవర్ చేయడానికి ఉపయోగించబడుతుంది.  ఈ పిల్లుల వయస్సు ప్రస్తుతం ఐదేళ్లు. ఆ మహిళ మరణానంతరం ఆరు నెలలు వాటిని ఈ ఇంట్లోనే ఉంచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు వాటిని..

రూ. 20కోట్లకు పైగా ఆస్తి, విలాసవంతమైన బంగ్లాను పిల్లులకు రాసిచ్చిన మహిళ.. కోర్టు జోక్యంతో..
Persian Cats
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 26, 2023 | 6:45 PM

వయసు పెరిగేకొద్దీ తల్లిదండ్రుల ఆస్తుల విషయంలో పిల్లలు, మనవళ్ల మధ్య గొడవలు పెరుగుతున్న కాలం ఇది. దీన్ని నివారించడానికి, తల్లిదండ్రులు వారి మరణానంతరం వారి పిల్లలు వారసులని ముందుగానే ప్రకటిస్తారు. కానీ, వివిధ కారణాల వల్ల పిల్లలకు కాకుండా ఇతరులకు ఆస్తిని ఇచ్చే తల్లిదండ్రులపై న్యాయపోరాటాలు జరగడం నేడు సర్వసాధారణం. మరోపక్క ఆస్తుల కోసం అయిన వారిని కూడా దారుణంగా చంపేసుకుంటున్న ఘటనలు కూడా అనేకం జరుగుతున్నాయి. ఇలాంటి కాలంలో ఒక మహిళ తన కోట్ల ఆస్తిని తన పెంపుడు పిల్లులకు రాసి ఇచ్చింది. నాన్సీ సాయర్ అనే మహిళ తన రూ.20 కోట్లకు పైగా ఆస్తిని, విలాసవంతమైన బంగ్లాను తన ఏడు పిల్లులకు రాసి ఇచ్చింది.

ఫ్లోరిడాకు చెందిన నాన్స్ సాయర్ తనకున్న కోట్ల ఆస్తిని పర్షియన్ పిల్లులు క్లియోపాత్రా, గోల్డ్ ఫింగర్, లియో, మిడ్‌నైట్, నెపోలియన్, స్నోబాల్, స్క్వీకీ పేరుతో ఆస్తిని రాసిపెట్టింది. అయితే, నాన్సీ గతేడాది మరణించింది. తాజాగా వీరి సంకల్పానికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఫ్లోరిడాలోని టంపాలో నాన్సీ బహుళ-మిలియన్ డాలర్ల ఇంటిని చివరి పిల్లి చనిపోయే వరకు కూడా విక్రయించలేరని రాయించింది. ఇంటిని విక్రయించే క్రమంలో పిల్లులను చంపే అవకాశం ఉందని ముందుగానే భావించిన నాన్సీ వీలునామా నమోదు చేసిందని నాన్సీ సన్నిహితురాలు స్థానిక మీడియాకు వివరించింది.

ఆ పిల్లులు నాన్సీకి ఇష్టమైనవి. నాన్సీ వాటి మరణానికి కారణం కాకూడదనే కోరిక ఆమెను అలాంటి చర్యకు ప్రేరేపించిందని సూచించింది.. నాన్స్ తన 84వ పుట్టినరోజు తర్వాత గత నవంబర్‌లో మరణించింది. నాన్సీ ఆస్తిని రాసిపెట్టడమే కాకుండా, పిల్లులను దీర్ఘకాలికంగా రక్షించడానికి కూడా పెద్ద మొత్తాన్ని కేటాయించింది. ఈ డిపాజిట్.. క్యాట్ ఫుడ్, ఇతర అవసరాల ఖర్చులను కవర్ చేయడానికి ఉపయోగించబడుతుంది.  ఈ పిల్లుల వయస్సు ప్రస్తుతం ఐదేళ్లు. నాన్సీ మరణానంతరం ఆరు నెలలు వాటిని ఈ ఇంట్లోనే ఉంచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు వాటిని జంతు సంరక్షణ శాఖకు అప్పగించారు. కోర్టు జోక్యంతో వాటిని దత్తత ఇచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..