Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Underwater Rail Road Tunnel: దేశంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు..! నీటి అడుగున రైలు, రోడ్డు మార్గం.. త్వరలోనే..

దేశంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుంది. దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ రైలు, రోడ్డు రవాణా కారిడార్‌ను ఈశాన్య ప్రాంతంలో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం రెండు వేర్వేరు సొరంగాలను సిద్ధం చేస్తామని సీఎం చెప్పారు. వీటిలో ఒకదానిపై రైళ్లు, మరొకదానిపై మోటారు వాహనాలు నడుస్తాయి.

Underwater Rail Road Tunnel: దేశంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు..! నీటి అడుగున రైలు, రోడ్డు మార్గం.. త్వరలోనే..
Underwater Rail Road Tunnel
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 26, 2023 | 5:40 PM

దేశంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుంది. దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ రైలు, రోడ్డు రవాణా కారిడార్‌ను ఈశాన్య ప్రాంతంలో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రాజెక్టులో భాగంగా బ్రహ్మపుత్ర నది కింద రెండు రోడ్డు ట్యూబ్ టన్నెల్స్, ఒక రైల్ ట్యూబ్ టన్నెల్ నిర్మించనున్నారు. అస్సాం రాష్ట్రంలోని నుమాలిఘర్, గోహ్‌పూర్‌లను కలుపుతూ మొదటి అండర్‌ వాటర్‌ రైల్‌రోడ్ టన్నెల్‌ నిర్మించే ప్రణాళికలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. బ్రహ్మపుత్ర నదిలోపల దీనిని నిర్మిస్తామని ఆయన తెలిపారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే తన హయాంలోనే రైల్వే టన్నెల్ నిర్మాణం చేపడతామన్నారు. అస్సాం మొదటి అండర్ వాటర్ టన్నెల్ నుమాలిగర్, గోపురం మధ్య రూ.6,000 కోట్లతో నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి వచ్చే నెలలో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. ఇక రైల్ రోడ్ టన్నెల్ అంటే రైళ్లు, మోటారు వాహనాలు (కార్లు, ట్రక్కులు, బస్సులు) ప్రయాణించగలవు. ఈశాన్య భారతదేశంలో బ్రహ్మపుత్ర నదిని దాటిన తొలి రైలు సొరంగం ఇదేకానుంది.

ఈ మేరకు అస్సాం సిఎం హిమంత బిస్వా శర్మమాట్లాడుతూ.. ఇది తన స్వప్నంగా చెప్పారు. బ్రహ్మపుత్ర కింద రైలు, మోటారు ట్రాఫిక్ రెండింటికి అనుగుణంగా సొరంగం నిర్మించగలగాలి అని అన్నారు. బ్రహ్మపుత్ర కింద సొరంగం ఏర్పాటుకు గల అవకాశాలపై ఢిల్లీలోని హైకమాండ్ తనను సంప్రదించినట్టుగా తెలిపారు. పర్వతాల లోపల నుంచి అటల్ సొరంగాన్ని ఎలా నిర్మించారో అలాగే బ్రహ్మపుత్ర కింద సొరంగాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకోసం రెండు వేర్వేరు సొరంగాలను సిద్ధం చేస్తామని సీఎం చెప్పారు. వీటిలో ఒకదానిపై రైళ్లు, మరొకదానిపై మోటారు వాహనాలు నడుస్తాయి.

ఇవి కూడా చదవండి

ఈ సొరంగం నిర్మాణం తర్వాత నుమలిగడ్డ-గోపురం మధ్య దూరం కేవలం 33 కిలోమీటర్లకే పరిమితమవుతుందని చెప్పారు. ఇంతకుముందు ఇది 220 కిలోమీటర్లు, ప్రయాణించడానికి 5-6 గంటలు పట్టేది. నీటి అడుగున రైల్వే సొరంగం ఏర్పాటుతో ఈ దూరం చేరుకోవడానికి కేవలం 40 నిమిషాలు మాత్రమే పడుతుంది. సొరంగం దాదాపు 35 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.

అస్సాం ముఖ్యమంత్రి తెలిపిన వివరాల మేరకు.. మొదటి టెండర్ జూలై 4, 2023న వెలువడనుంది. అదనంగా, ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరిగితే భూమి ఎంపిక కోసం డిఐపిఆర్ సంకలనం చేసిన తర్వాత తన హయాంలో ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. బ్రహ్మపుత్ర ఉత్తర, దక్షిణ ప్రాంతాలను ఒక దగ్గరికి చేర్చే ప్రణాళికను ప్రధాని మోదీ ఇప్పటికే ఆమోదించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి