Kamal Haasan: షర్మిలకు కార్ గిఫ్ట్ ఇచ్చిన కమల్.. ‘ఉద్యోగినిగా కాదు.. ఇకపై ఉద్యోగాలివ్వాలి’

షర్మిలకు పబ్లిసిటీ మోజు ఎక్కువైందని , పాపులారిటీ కోసం బస్సు లో ఉన్న ప్రయాణికుల్ని పట్టించుకోవడం లేదని అందుకే ఉద్యోగం నుంచి తీసేసారని రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ వివాదంపై ప్రముఖ నటుడు, ఎంఎన్‌ఎం పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ స్పందించారు.

Kamal Haasan: షర్మిలకు కార్ గిఫ్ట్ ఇచ్చిన కమల్.. 'ఉద్యోగినిగా కాదు.. ఇకపై ఉద్యోగాలివ్వాలి'
Kamal Haasan gifts a car to Sharmila, a Coimbatore-based woman who quit her job as a bus driver over a controversy surrounding issuing a travel ticket to DMK MP Kanimozhi last week
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 26, 2023 | 5:50 PM

తమిళనాడులో జాబ్ పోగొట్టుకున్న మహిళా డ్రైవర్ షర్మిలకు అండగా నిలిచారు మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ చీఫ్ కమల్‌ హాసన్‌. ఉద్యోగం కోల్పోయిన ఆ మహిళా డ్రైవర్‌ను పార్టీ ఆఫీస్‌కు పిలిపించి.. ఓ కారును గిఫ్ట్‌గా ఇవ్వడంతోపాటు ఆర్థికసాయం అందజేశారు. పార్లమెంట్ సభ్యురాలు  కనిమొళి ఇటీవల కొయంబత్తూర్‌లోని గాంధీపురం నుంచి పీలమేడు వరకు షర్మిల్ నడుపుతున్న ప్రైవేట్‌ సంస్థకు చెందిన బస్సులో ట్రావెల్ చేశారు. అయితే.. ఆ బస్సును నడుపుతోన్న షర్మిల అనే మహిళా డ్రైవర్‌ ప్రతిభను మెచ్చుకుంటూ.. కనిమొళి ఆమెకు చేతి గడియారాన్ని బహూకరించారు. అయితే.. ఆ సమయంలో తాను నడిపిన బస్సులో ట్రైనీ మహిళా కండక్టర్‌.. ఎంపీ కనిమొళితో అనుచితంగా ప్రవర్తించిందంటూ షర్మిల తన యాజమాన్యానికి ఫిర్యాదు చేయడం వివాదానికి దారితీసింది.

మరోవైపు… తన పాపులారిటీ కోసం బస్సులో ప్రయాణించేందుకు తరచుగా సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ.. ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేస్తున్నట్లు ఆ కండక్టర్‌ కూడా షర్మిలపై ఫిర్యాదు చేసింది. ఇలా ఇరువురి వాదనల నేపథ్యంలో షర్మిలను ఉద్యోగం నుంచి తొలగించించింది యాజమాన్యం. దాంతో.. డ్రైవర్‌ ఉద్యోగం నుంచి షర్మిలను తొలగించిన విషయం చర్చనీయాంశమైంది. అయితే.. ఎంపీ కనిమొళిని కలవడమే షర్మిల ఉద్యోగం పోవడానికి కారణమనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఇది కాస్తా.. కమల్ హాసన్ దృష్టికి వెళ్లడంతో ఆమెకు కారును బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా.. ఇప్పటివరకు ఉద్యోగిగా ఉన్న షర్మిల.. ఇకనుంచి ఎంతో మందికి ఉపాధి కల్పించేలా ఎదగాలని ఆకాంక్షించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల ఎదుగుదలను అడ్డుకోవడం మంచిదికాదన్నారు కమల్‌హాసన్‌.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?