Delhi Metro: మెట్రో జర్నీతో గిన్నిస్‌ రికార్డు.. 15 గంటల్లో 286 మెట్రో స్టేషన్లను చుట్టేసిన ఘనత

మరిన్ని రికార్డులను బద్దలు కొట్టాలనే లక్ష్యంతో అతను 24 గంటల్లో సందర్శించిన అత్యధిక మ్యూజియంలు, నెలలో సందర్శించిన అత్యధిక ప్రార్థనా స్థలాల రికార్డులను కూడా అతడు తన ఖాతాలో వేసుకున్నాడు.

Delhi Metro: మెట్రో జర్నీతో గిన్నిస్‌ రికార్డు.. 15 గంటల్లో 286 మెట్రో స్టేషన్లను చుట్టేసిన ఘనత
Guinness World Record
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 26, 2023 | 7:15 PM

చాలా మంది ఢిల్లీ వాసులు మెట్రోలో ప్రయాణించడం అనేది ప్రాపంచికమైన, అత్యంత కష్టమైన పనిగా భావిస్తారు. అయితే ఢిల్లీకి చెందిన ఒక ఫ్రీలాన్స్ పరిశోధకుడు మాత్రం దానిని సువర్ణావకాశంగా మార్చుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. ఈ ఘనత సాధించడానికి అతడు ఒక-రోజు టూరిస్ట్ కార్డ్‌ని ఉపయోగించారు. ఉదయం 5 గంటలకు బ్లూ లైన్‌లో రోజును ప్రారంభించి, రాత్రి 8:30 గంటలకు గ్రీన్ లైన్‌లోని బ్రిగేడియర్ హోషియార్ సింగ్ స్టేషన్‌లో ముగించారు. టూరిస్ట్ కార్డ్ 348 కిమీల నెట్‌వర్క్‌లో ఒక రోజులో అపరిమిత రైడ్‌లను ఎంజాయ్‌ చేసే అనుమతించింది. దీంతో ఢిల్లీకి చెందిన ఓ స్వతంత్ర పరిశోధకుడు ఢిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లకు 15 గంటల 22 నిమిషాల్లో ప్రయాణించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. 70కి పైగా దేశాలు పర్యటించిన శశాంక్ మను 2021లో రికార్డు సృష్టించాడు. ఏప్రిల్ 2023లో అధికారికంగా ధ్రువీకరణ పొందారు.

ఢిల్లీ వ్యక్తి తన ప్రయాణంలోని ప్రతి అడుగు ఫోటోగ్రాఫ్‌లు, ఏ మాత్రం ఎడిటింగ్‌ చేయని వీడియోతో రికార్డ్ చేశారు. అంతేకాదు.. ఇతర ప్రయాణీకులు సంతకం చేసిన ఫారమ్‌తో ధృవీకరించాలని నిర్ధారించుకున్నాడు. గిన్నిస్ మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండే ప్రయాణంలో ఇద్దరు ‘స్వతంత్ర సాక్షులు’ వారితో పాటు ఉన్నారు. ప్రతి స్టేషన్‌లో రైలు తలుపులు తెరిచే, క్లోజ్‌ అయ్యే సమయాన్ని గమనించాలని నిర్ధారించారు. గిన్నిస్ రికార్డ్స్ బృందంతో నెలల తరబడి చర్చలు జరిపిన మను ఎట్టకేలకు ఆ ఘనతను సొంతం చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

అయితే, కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఈ రికార్డును తీయడానికి మను ప్రేరణ పొందినట్టుగా చెప్పాడు. లాక్‌డౌన్‌ అనంతరం మెట్రో సేవలను పునఃప్రారంభించిన తర్వాత మను రికార్డు సృష్టించేందుకు ప్రయత్నించారు.

మరిన్ని రికార్డులను బద్దలు కొట్టాలనే లక్ష్యంతో అతను 24 గంటల్లో సందర్శించిన అత్యధిక మ్యూజియంలు, నెలలో సందర్శించిన అత్యధిక ప్రార్థనా స్థలాల రికార్డులను కూడా అతడు తన ఖాతాలో వేసుకున్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ