CM KCR: సీఎం కేసీఆర్ టార్గెట్ మహారాష్ట్రే.. బీఆర్ఎస్ ‘రైతు అజెండా’తో ప్రజల ముందుకు..
CM KCR Maharashtra Visit: మహారాష్ట్రను టార్గెట్ చేసిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ వరుసగా రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇప్పటికే నాందేడ్, నాగపూర్‌లో పర్యటించిన కేసీఆర్..
CM KCR Maharashtra Visit: మహారాష్ట్రను టార్గెట్ చేసిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ వరుసగా రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇప్పటికే నాందేడ్, నాగపూర్‌లో పర్యటించిన కేసీఆర్.. తాజాగా సోలాపూర్ లో రెండోరోజులపాటు పర్యటిస్తున్నారు. రైతు అజెండాతో ప్రజల్ని బీఆర్‌ఎస్ వైపు తిప్పుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. కాగా.. మహారాష్ట్రలో కేసీఆర్ టూర్.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ రాజకీయ వ్యూహాలను అన్ని పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. సోమవారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా.. పార్టీ నేతలతో భారీ కాన్వాయ్ తో తరలివెళ్లిన కేసీఆర్ సోలాపూర్ లో బస చేశారు. మంగళవారం మహారాష్ట్ర పండరీపూర్‌లో సీఎం కేసీఆర్ పర్యటన మొదలైంది. ముందుంగా సీఎం కేసీఆర్.. రుక్మిణీ సమేత విఠలేశ్వరుడి ఆలయంలో పూజలు నిర్వహించారు.
అనంతరం సర్కోలి గ్రామంలో జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ సమక్షంలో పలువురు కీలక నేతలు BRSలో చేరనున్నారు. మధ్యాహ్నం తుల్జాపూర్ భవానీ అమ్మవారి దర్శనం కూడా చేసుకోనున్నారు. BRS విస్తరణ లక్ష్యంగా కొనసాగుతున్న కేసీఆర్ టూర్.. ప్రస్తుతం మహా పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది.
సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపించాలన్న లక్ష్యంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రపై మొదట ఫుల్ ఫోకస్ పెట్టారు. రైతుల సమస్యలను, వారి డిమాండ్లను పరిగణలోకి తీసుకుని.. అక్కడ బీఆర్ఎస్ విస్తరణ కోసం సీఎం కేసీఆర్ ఈ రోజు పలు హామీలు ప్రకటిస్తారని తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..