Hyderabad: ఐటి రిటైర్డ్ కమిషనర్ ఇంట్లో భారి చోరి.. దొంగకు సహకరించిన ఎస్ఐ?
హైదరాబాద్‌లో భారీ చోరీ చోటు చేసుకుంది. అది కూడా ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ కమిషనర్ శామ్యూల్ ఇంట్లో జరగడం సంచలనంగా మారింది. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఈ చోరీ వెనుక ఓ పోలీసు అధికారి హస్తం ఉన్నట్లు దొంగలు చెప్పడం..

హైదరాబాద్‌లో భారీ చోరీ చోటు చేసుకుంది. అది కూడా ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ కమిషనర్ శామ్యూల్ ఇంట్లో జరగడం సంచలనంగా మారింది. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఈ చోరీ వెనుక ఓ పోలీసు అధికారి హస్తం ఉన్నట్లు దొంగలు చెప్పడం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భూమి కొనుగోలు చేస్తానంటూ రిటైర్డ్ కమిషనర్ శామ్యూల్‌కు సురేందర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో తరచుగా రాకపోకలు సాగించాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇంటికి వచ్చిన సురేందర్.. తన వెంట టిఫిన్, కొబ్బరి నీళ్లు తీసుకువచ్చాడు. ఆ కొబ్బరి నీళ్లలో మత్తు మందు కలిపాడు. కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే శ్యామ్యూల్ స్పృహతప్పి పడిపోయాడు. ఇదే ఛాన్స్‌గా భావించిన సురేందర్.. ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. రూ. 5 లక్షల నగదుతో పాటు 30 తులాల బంగారం చోరీ చేశాడు. అనంతరం పారిపోయాడు.
కాసేపటి తరువాత స్పృహలోకి వచ్చిన శ్యామ్యుల్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ముషీరాబాద్ పోలీసులు.. నిందితుడు సురేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా.. సంచలన విషయాలు బయటపెట్టాడు. తన వెనుక ఒక ఎస్సై హస్తం ఉన్నట్లు వెల్లడించాడు నిందితుడు సురేందర్. నిందితుడు చెప్పిన సమాచారం సంచలనం రేపడంతో ఆమేరకు దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..