AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: దేశంలో మార్పు కోసం పనిచేస్తాం.. ఎందుకింత ఆక్రోశం.. బీజేపీ, కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ ఫైర్

CM KCR Maharashtra Visit: బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ.. మనకంటే చిన్న దేశాలు ఎంతో అభివృద్ధి చెందాయి.. బీఆర్ఎస్ ఎవరికీ ఏ టీమ్ కాదు.. అంటూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు.

CM KCR: దేశంలో మార్పు కోసం పనిచేస్తాం.. ఎందుకింత ఆక్రోశం.. బీజేపీ, కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ ఫైర్
Cm Kcr
Shaik Madar Saheb
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 27, 2023 | 7:33 PM

Share

CM KCR Maharashtra Visit: బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ.. మనకంటే చిన్న దేశాలు ఎంతో అభివృద్ధి చెందాయి.. బీఆర్ఎస్ ఎవరికీ ఏ టీమ్ కాదు.. అంటూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. మహారాష్ట్రలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ పండరీపూర్‌ సమీపంలోని సర్కోలి గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. దేశంలో పరివర్తన తెచ్చే పార్టీ BRS అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. తమపై కాంగ్రెస్‌, బీజేపీ చేస్తున్న ఆరోపణలకు KCR కౌంటర్‌ ఇచ్చారు. A టీమ్‌, B టీమ్‌ అని కాంగ్రెస్‌, బీజేపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. తాము ఏ పార్టీకి A టీమ్‌.. బీ టీమ్ కాదని స్పష్టం చేశారు. తమది రైతులు, దళితులు, అణగారిన వర్గాల టీమ్‌ అని కేసీఆర్‌ అన్నారు.

దేశంలో మార్పు కోసం బీఆర్ఎస్ పనిచేస్తుందని కేసీఆర్ స్పష్టంచేశారు. కేంద్రానికి దమ్ముంటే.. దేశంలో ప్రతీ ఎకరాకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న జల విధానాలను బంగాళాఖాతంలో వేయాలంటూ ఫైర్ అయ్యారు. మనకంటే చిన్న దేశాలు అభివృద్ది చెందాయని.. బీఆఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలంటూ కోరారు.రైతులు తమ వెంట ఉంటే తాము ఎవరికో టీమ్‌ అవ్వాల్సిన అవసరమేంటని కేసీఆర్‌ ప్రశ్నించారు. మహారాష్ట్ర వైపు తాము వస్తూ మూడు నెలలు కాలేదని, అప్పుడే తమపై ఎందుకింత ఆక్రోశం, ఆగ్రహమని కేసీఆర్‌ ప్రశ్నించారు.

దేశంలో పరివర్తన వస్తే దేశంలోని ప్రతీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మేకిన్‌ ఇండియా అని చెప్తుంటే దేశంలో ఎక్కడ చూసినా చైనా బజార్లు ఎందుకు కనిపిస్తున్నాయని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. మేకిన్‌ ఇండియా ఎక్కడికి పోయిందని నిలదీశారు. విధానాలు మారాల్సిన అవసరం ఉందని, దేశం మారితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కేసీఆర్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి

మహారాష్ట్రలో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ ఉదయం పది గంటల సమయంలో సోలాపూర్‌ నుంచి పండరీపూర్‌ చేరుకున్నారు. అక్కడ విఠోబా దర్శనం చేసుకున్న తర్వాత సమీపంలోని సర్కోలి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ కేసీఆర్‌ సమక్షంలో NCP మాజీ ఎమ్మెల్యే భారత్‌ భాల్కే కుమారుడు భగీరథ్‌ భాల్కే BRS పార్టీలో చేరారు. ఆయనతో పాటు పండరీపూర్‌ పట్టణానికి చెందిన అనేక మంది పార్టీలో చేరారు. అందరికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేసీఆర్‌ ఆహ్వానించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..