BRS vs Shiv sena: ఆ భయంతోనే మహారాష్ట్రలో పర్యటన.. సీఎం కేసీఆర్‌పై శివసేన సంచలన వ్యాఖ్యలు..
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై శివసేన తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేసింది. ఆ పార్టీ నేతలు వరుసగా విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో ఓడిపోతారనే భయంతోనే కేసీఆర్ మహారాష్ట్రకు వస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ విమర్శించారు.

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై శివసేన తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేసింది. ఆ పార్టీ నేతలు వరుసగా విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో ఓడిపోతారనే భయంతోనే కేసీఆర్ మహారాష్ట్రకు వస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ విమర్శించారు. ఉద్యమనేత, పోరాట యోధుడనే పేరున్న కేసీఆర్.. బీజేపీకి ఎందుకు సరెండరవుతున్నారో అర్థం కావడం లేదని రౌత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పండరీపూర్‌లోని విఠోబాపై కేసీఆర్‌కు ఎప్పుడు భక్తి మొదలైందని ప్రశ్నించారు. అంత భారీ వాహనశ్రేణితో వచ్చి పండరీపూర్‌లో బలప్రదర్శన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కేసీఆర్‌ను ప్రశ్నించారు సంజయ్ రౌత్. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీటీమ్ అనే అనుమానం కలుగుతుందని వ్యాఖ్యానించారాయన.
జాతీయస్థాయిలో రాణించాలనే లక్ష్యంతో గులాబీ దళపతి కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చిన విషయం తెలిసిందే. పార్టీని స్థాపించడం ఒక ఎత్తు, ప్రజల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ఈ నేపథ్యంలోనే పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించే లక్ష్యంతో మొదటగా పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రపై గురిపెట్టారు కేసీఆర్. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు పర్యాయాలు మహారాష్ట్రలో భారీ సభలు నిర్వహించారు. ఇప్పుడు మరోసారి 500 కాన్వాయ్‌తో భారీ ర్యాలీగా మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. తొలిరోజు పర్యటన ముగియగా.. రెండో రోజు పర్యటన కొనసాగుతోంది.
మహారాష్ట్రలోని పండరీపూర్‌లో సీఎం కేసీఆర్ ఇవాళ పర్యటిస్తున్నారు. రుక్మిణీ సమేత విఠలేశ్వరుడి ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరికాసేపట్లో సర్కోలి గ్రామంలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలోనే కేసీఆర్ సమక్షంలో పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరబోతున్నారు. సభ అనంతరం మధ్యాహ్నం తుల్జాపూర్ భవానీ అమ్మవారిని దర్శించుకోనున్నారు.




బీఆర్ఎస్కు మంచి స్పందన..
మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు మంచి స్పందన వస్తోందని మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం కేసీఆర్‌తో కలిసి పండరీపూర్‌లో విఠోబా దర్శనం కోసం వచ్చిన హరీష్ రావు టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణలో రైతులకందుతున్న ప్రయోజనాలు కావాలనుకుంటే మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహారాష్ట్ర యువత, రైతులు అందరూ బీఆర్ఎస్ వైపు ఉన్నారని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




