AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: పట్టాలెక్కిన మరో 5 వందే భారత్‌ రైళ్లు.. జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం భోపాల్‌లోని రాణి కమలపాటి స్టేషన్ నుండి ఐదు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో రెండు రైళ్లను ప్రత్యక్షంగా ప్రారంభించగా.. మరో మూడు రైళ్లను వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు

PM Modi: పట్టాలెక్కిన మరో 5 వందే భారత్‌ రైళ్లు.. జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ..
Pm Narendra Modi
Basha Shek
|

Updated on: Jun 27, 2023 | 11:51 AM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం భోపాల్‌లోని రాణి కమలపాటి స్టేషన్ నుండి ఐదు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో రెండు రైళ్లను ప్రత్యక్షంగా ప్రారంభించగా.. మరో మూడు రైళ్లను వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్  తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కాగా బెంగళూరు-హుబ్లీ బాలాసోర్ ప్రమాదం తర్వాత తొలిసారిగా ఐదు వందే భారత్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రారంభమైన వందే భారత్ రైళ్లు దేశంలోని 6 రాష్ట్రాలను కలుపుతాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, బీహార్‌, ఝార్ఖండ్‌తో కనెక్టివిటీని కలిగి ఉంటాయి. ఇక దేశంలో ఇప్పటివరకు మొత్తం 23 వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రాగా, బీహార్, జార్ఖండ్, గోవాలో తొలిసారిగా వందే భారత్ రైలు కూతపెట్టనుంది. కాగా వచ్చే ఏడాదిలోగా దేశంలో 75 వందేభారత్ రైళ్లు నడపనున్నట్లు గత ఏడాది ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మోడీ ప్రారంభించిన వందే భారత్‌ రైళ్లు..

  • భోపాల్-ఇండోర్
  • భోపాల్-జబల్పూర్
  • గోవా-ముంబై
  • హతియా-పాట్నా
  • బెంగళూరు-హుబ్లీ

పర్యాటకానికి మరింత ప్రోత్సాహం..

భోపాల్-ఇండోర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మధ్యప్రదేశ్‌లోని రెండు ముఖ్యమైన నగరాలను కలుపుతోంది. వందే భారత్‌ రైలు కారణంగా ఈ ప్రాంతాలలో సాంస్కృతిక, పర్యాటక ప్రదేశాల కనెక్టివిటీ మెరుగుపడుతుంది. ఇక భోపాల్-జబల్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జబల్‌పూర్ నుండి భోపాల్‌ను కలుపుతుంది. దీనివల్ల పర్యాటక ప్రాంతాలకు కూడా ప్రయోజనం కలుగుతుంది. ఇక రాంచీ-పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జార్ఖండ్‌, బీహార్‌ రాష్ట్రాలకు మొదటి వందే భారత్ రైలు కావడం విశేషం. పాట్నా, రాంచీ నగరాల మధ్య కనెక్టివిటీని పెంచే ఈ రైలు పర్యాటకులు, విద్యార్థులు మరియు వ్యాపారవేత్తలకు వరంగా మారనుంది. ధార్వాడ్-బెంగళూరు వందే భారత్ కర్ణాటక-ధార్వాడ్ మరియు హుబ్లీలోని ముఖ్యమైన నగరాలను రాష్ట్ర రాజధాని బెంగళూరుతో కలుపుతుంది. దీని వల్ల ఈ ప్రాంత పర్యాటకులు, విద్యార్థులు, వ్యాపారులు తదితరులకు ఎంతో మేలు జరుగుతుంది. గోవా-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గోవా రాష్ట్రంలో పట్టాలెక్కిన మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మొదలై గోవాలోని మడ్‌గావ్ స్టేషన్ వరకు నడుస్తుంది. గోవా, మహారాష్ట్రల మధ్య పర్యాటకానికి ఈ ఎక్స్‌ ప్రెస్‌ మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం  క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?