Gandeevadhari Arjuna: వరుణ్ తేజ్ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది.. గాండివధారి అర్జున వచ్చేది అప్పుడే
ఈ సారి యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు వరుణ్. ఈ మెగా ప్రిన్స్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం గాండివధారి అర్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.

మెగా హీరో వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి దూసుకుపోతున్నాడు. ముకుంద సినిమాతో మొదలు పెట్టుకొని చివరిగా వచ్చిన గని సినిమా వరకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకులను అలరించాడానికి రెడీ అయ్యాడు. ఈ సారి యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు వరుణ్. ఈ మెగా ప్రిన్స్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం గాండివధారి అర్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో వరుణ్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ మూవీని ఆగస్టు లో రిలీజ్ చేస్తామని ముందుగానే ప్రకటించారు మేకర్స్.
అయితే ఈ మూవీ రిలీజ్ విషయంలో అనేక వార్తలు వచ్చాయి. సినిమా షూటింగ్ కంప్లీట్ కాలేదని.. ఆగస్టులో రావడంకష్టమేనని టాక్ నడిచింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాను కూడా ఆగస్టులో రిలీజ్ చేయనున్నారు. దాంతో వరుణ్ వెనక్కి తగ్గారని వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. గాండివధారి అర్జున అనుకున్న తేదీకి వస్తుదేనని ప్రకటించింది. మరోసారి ఈ మూవీ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఆగస్టు 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.
View this post on Instagram