- Telugu News Photo Gallery Cinema photos Kantara Fame Rishab Shetty Honoured With Vishwa Shreshta Kannadiga 2023 Award
Rishab Shetty: కాంతారా హీరోకు అరుదైన గౌరవం.. ‘విశ్వ శ్రేష్ఠ కన్నడిగ 2023’ పురస్కారం అందుకున్న రిషబ్ శెట్టి
అమెరికాలోని వాషింగ్టన్‌లోని సియాటిల్‌లోని పారామౌంట్ థియేటర్‌లో రిషబ్‌కు 'విశ్వ శ్రేష్ఠ కన్నడిగ 202' అవార్డు ప్రదానం చేశారు. దీంతో అతనికి ప్రముఖులు, అభిమానులు, నెటిజన్ల నుంచి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Updated on: Jun 28, 2023 | 1:51 PM

'కాంతారా’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు, ప్రశంసలు అందుకున్నాడీ హీరో.

తాజాగా మరో అరుదైన గౌరవం అందుకున్నారు రిషబ్. అమెరికాలోని స్థిరపడ్డ కన్నడిగులు ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక 'విశ్వ శ్రేష్ఠ కన్నడిగ 2023' పురస్కారాన్ని ఆయన అందుకున్నారు.

అమెరికాలోని వాషింగ్టన్‌లోని సియాటిల్‌లోని పారామౌంట్ థియేటర్‌లో రిషబ్‌కు 'విశ్వ శ్రేష్ఠ కన్నడిగ 2023' అవార్డు ప్రదానం చేశారు. దీంతో అతనికి ప్రముఖులు, అభిమానులు, నెటిజన్ల నుంచి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ సందర్భంగా వాషింగ్టన్ స్టేట్ కన్నడిగర్ మను గౌరవ్ బృందం, సియాటిల్‌లోని సహ్యాద్రి కన్నడ సంఘం సభ్యులు రిషబ్ శెట్టిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిషబ్ సతీమణి ప్రగతి శెట్టి కూడా పాల్గొన్నారు.

రిషబ్ శెట్టి అమెరికా టూర్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక కాంతారా పార్ట్ 2 ను కూడా తెరకెక్కించే పనుల్లో ఉన్నాడీ ట్యాలెంటెడ్ హీరో అండ్ డైరెక్టర్.





























