Paruchuri Gopala Krishna: వారంతా ఆ మంచి పని చేసి ఉంటే రాకేష్ మాస్టర్ జీవితం మరోలా ఉండేది.. పరుచూరి ఎమోషనల్
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫ్ రాకేష్ మాస్టర్ ఇటీవల హఠన్మారణం చెందారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి స్టార్ కొరియోగ్రాఫర్లను ఇండస్ట్రీకి అందించిన ఆయన మరణం అందరినీ కలిచివేసింది. ఈక్రమంలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ రాకేష్ మాస్టర్‌కు నివాళి అర్పించారు.
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫ్ రాకేష్ మాస్టర్ ఇటీవల హఠన్మారణం చెందారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి స్టార్ కొరియోగ్రాఫర్లను ఇండస్ట్రీకి అందించిన ఆయన మరణం అందరినీ కలిచివేసింది. ఈక్రమంలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ రాకేష్ మాస్టర్‌కు నివాళి అర్పించారు. అదే సందర్భంలో మాస్టర్ పడిన కష్టాలపై ‘పరుచూరి పలుకులు’ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ‘రాకేష్ మాస్టర్‌తో నేను ఎక్కువగా పనిచేయలేదు. కానీ ఆయన గురువైన ముక్కురాజుతో కలిసి నేను ఎన్నో సినిమాల్లో నటించాను. రాకేష్ మాస్టర్ దాదాపు 1500 పాటలకు కొరియోగ్రఫీ చేశారు. శేఖర్, జానీ అనే ఇద్దరు డ్యాన్స్ మాస్టర్లను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. అలాంటి రాకేష్ మాస్టర్ ఇక లేరంటూ టీవీల్లో వచ్చిన వార్తలు చూసి ఒక్కసారిగా షాకయ్యాను. ఇక వాళ్ల అబ్బాయి మీడియా ముందుకొచ్చి ఇకనైనా మా నాన్న గురించి మాట్లాడుకోవడం ఆపేయండి అంటూ చెబుతుంటే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి’ అని పరుచూరి చెప్పుకొచ్చారు.
అలాగే టాలీవుడ్ అప్ కమింగ్ హీరోలు కానీ, దర్శకులు కానీ రాకేష్ మాస్టర్‌కు అవకాశాలిచ్చి ఉంటే ఆయన జీవితం మరోలా ఉండేదని పరుచూరి అభిప్రాయపడ్డారు. ‘ రాకేష్ మాస్టర్ సినిమా ఇండస్ట్రీకి ఎన్నో సేవలందించారు. ఎందరో డ్యాన్స్ మాస్టర్లను అందించారు. వారంతా మాస్టర్‌ను ఆదుకుని ఉండే బాగుండేది. అలాగే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న అప కమింగ్ హీరోలు, దర్శకుడు ఎవరైనా ఆయనకు సినిమా ఛాన్సులు ఇచ్చి ఉంటే మాస్టర్ జీవితం మరోలా ఉండేది. మాస్టర్ వీడియోలు చూస్తుంటే నాకు అదే బాధ కనిపించేది. ఆయన చాలా స్ట్రగుల్ అయ్యారు. మాస్టర్ జీవితం మనకు మంచి ఉదాహరణ. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, శివుడు కూడా ఆలయన లయ, విన్యాసాలను చూడాలని ప్రార్థిస్తున్నాను’ అని పరుచూరి ఎమోషనల్ అయ్యారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.