Adipurush: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆదిపురుష్.. స్ట్రీమింగ్ అయ్యేది అప్పటినుంచేనా..?
హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ప్రభాస్ అభిమానులు సైతం దర్శకుడు ఓం రౌత్ పై మండిపడుతున్నారు. దాదాపు 500 కోట్లు పెట్టి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.

ప్రభాస్ నటించిన లేటెస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ప్రభాస్ అభిమానులు సైతం దర్శకుడు ఓం రౌత్ పై మండిపడుతున్నారు. దాదాపు 500 కోట్లు పెట్టి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ప్రభాస్ రాముడిగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ కృతిసనన్ సీతగా నటించి మెప్పించింది. రామాయణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో గ్రాఫిక్స్ మైనస్ అయ్యాయి. ముఖ్యంగా రామాయణ కథను మార్చి చూపించారని వివాదాలు రేగాయి. రావణాసురుడి పాత్రను తప్పుగా చూపించారని కొందరంటుంటే.. మరికొందరు ఏకంగా రామాయణాన్ని పక్కన పెట్టి ఎదో హాలీవుడ్ సినిమాలను చూసి ఈ సినిమాను తెరకెక్కించారు అని మండిపడుతున్నారు.
ఇక ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ కారణంగా మంచి ఓపినింగ్స్ తో పాటు కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. కానీ రానురాను ఈ మూవీ కలెక్షన్స్ తగ్గిపోతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఆసక్తికర వార్త ఒకటి వైరల్ అవుతుంది.
ఆదిపురుష్ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదిపురుష్ ఓటీటీ రిలీజ్ పై నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఈ మూవీని ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం రోజున ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే దేనికి పై అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమాన్ గా దేవ్ దత్త్ ఇక రావణ్ గా సైఫ్ అలీ ఖాన్ నటించిన విషయం తెలిసిందే.