‘జీ కర్దా’ సిరీస్‌లో తమన్నా క్యారెక్టర్ కోసం ముందుగా ఈ నటిని అనుకున్నారట! ఆమెవరంటే.?
'జీ కర్దా'.. ఇప్పుడిదే ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్. తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
‘జీ కర్దా’.. ఇప్పుడిదే ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్. తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో తమన్నా చేసిన లిప్‌లాక్ సీన్స్, హద్దులు మీరిన బెడ్‌రూమ్ సన్నివేశాలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఇక గతంలో లిప్‌లాక్ సీన్లకు నో చెప్పిన తమన్నా.. ఇప్పుడు అలాంటి సన్నివేశాల్లో శృతిమించి నటించడంతో ఈమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. తమన్నా కంటే ముందుగా ఈ పాత్ర కోసం ఓ స్టార్ హీరోయిన్‌ను సంప్రదించారట మేకర్స్. ప్రస్తుతం అందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
‘జీ కర్దా’ వెబ్ సిరీస్‌లో తమన్నా క్యారెక్టర్ కోసం ముందుగా హాట్ బ్యూటీ పూజా హెగ్డేను సంప్రదించారట మేకర్స్. అయితే కథ విన్న తర్వాత శృతిమించిన రొమాంటిక్ సీన్లకు పూజా హెగ్డే నో చెప్పిందట. దీంతో ఆ పాత్ర కాస్తా తమన్నా దగ్గరకు వెళ్లిందట. దీనిలో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం ఇంటర్నెట్‌లో తెగ హల్చల్ చేస్తోంది.