AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV Vyooham: అసలు తగ్గనంటోన్న ఆర్జీవీ.. ‘వ్యూహం’ నుంచి చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ల లుక్స్‌ రిలీజ్‌

మొత్తం రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్లు, ఫస్ట్‌ లుక్స్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. కొన్ని రాజకీయ వర్గాల నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి. అయితే వర్మ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా వ్యూహం సినిమాకు సంబంధించి మరో అప్డేట్‌ ఇచ్చారు ఆర్జీవీ.

RGV Vyooham: అసలు తగ్గనంటోన్న ఆర్జీవీ.. 'వ్యూహం' నుంచి చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ల లుక్స్‌ రిలీజ్‌
Vyooham Movie
Basha Shek
|

Updated on: Jun 28, 2023 | 12:15 PM

Share

ఏపీ సీఎం జగన్‌ జీవితంలోని వాస్తవిక సంఘటనలను ఆధారంగా చేసుకుని సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం వ్యూహం. మొత్తం రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్లు, ఫస్ట్‌ లుక్స్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. కొన్ని రాజకీయ వర్గాల నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి. అయితే వర్మ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా వ్యూహం సినిమాకు సంబంధించి మరో అప్డేట్‌ ఇచ్చారు ఆర్జీవీ. మూవీలోని పవన్ క ళ్యాణ్, చిరంజీవి ల ఫస్ట్‌ లుక్‌ను రివీల్‌ చేశారు. ఈ మేరకు ఇద్దరి కలిస్తున్న ఓ ఫొటోను తన సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేశాడు. దీనికి 2+2=1 అని వెరైటీగా క్యాప్షన్‌ ఇచ్చాడు. దీంతో అది కాస్తా వైరల్‌గా మారాయి. అంటే వ్యూహం సినిమాలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల ప్రస్తావన ఉంటుందని ఇట్టే అర్థమవుతోంది. ఈ కొత్త పోస్టర్‌ చూస్తోంటే 2019 ఎన్నికల తర్వాత పవన్‌ చిరంజీవితో ఏదో మాట్లాడి తిరిగి వెళ్లిపోతున్నట్లుగా తెలుస్తోంది.

కాగా మొత్తం రెండు పార్టులుగా ఈ సినిమా రాబోతోంది. వ్యూహం తర్వాత శపథం అంటూ రెండో భాగాన్ని కూడా తీసుకొస్తున్నారు ఆర్జీవీ. ఇక టీజర్‌లో వైఎస్సార్‌ చనిపోవడం, ఆ బాధను దిగమింగుకోలేక ఎంతో మంది అభిమానులు చనిపోవడం, ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామలను చూపించారు. అలాగే జగన్‌పై కసులు, కొత్త పార్టీ ఏర్పాటు అంశాలను స్పృశిస్తూ టీజర్‌ను కట్‌ చేశారు. ఏపీ పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు వంటి రాజకీయ నేతలు ఇప్పటికే వర్మకు హెచ్చరికలు జారీ చేశారు. సోనియాను కానీ ఇతర పార్టీనేతలను కించపరిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు . మరి ఇప్పుడు ఏకంగా చిరంజీవి, పవన్‌ కల్యాణ్ లుక్స్‌ను రిలీజ్‌ చేశాడు. మరి దీనికి మెగాభిమానులు ఏ విధంగా రియాక్టవుతారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
ఇలా చేస్తే.. భలే కరకరలాడుతూ వస్తాయ్..
ఇలా చేస్తే.. భలే కరకరలాడుతూ వస్తాయ్..
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని
200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా