Upendra: కొత్త సినిమాను స్టార్ట్‌ చేసిన కన్నడ సూపర్‌ స్టార్‌ ఉపేంద్ర.. ఆ సూపర్‌ హిట్‌ సినిమాకు సీక్వెల్‌గా..

కన్నడ సూపర్ స్టార్‌ ఉపేంద్ర గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వైవిధ్యమైన కథలతో సినిమాలు తీసే ఈ వెర్సటైల్‌ హీరోకు తెలుగునాట కూడా భారీగా అభిమానులు ఉన్నారు. ఉప్పీ నటించిన కన్నడ డబ్బింగ్‌ సినిమాలు తెలుగులో కూడా సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఈ క్రేజ్‌తోనే రక్తకన్నీరు, కన్యాదానం, సన్నాఫ్‌ సత్యమూర్తి వంటి స్ట్రెయిట్‌ తెలుగు సినిమాల్లోనూ నటించాడాయన.

Upendra: కొత్త సినిమాను స్టార్ట్‌ చేసిన కన్నడ సూపర్‌ స్టార్‌ ఉపేంద్ర.. ఆ సూపర్‌ హిట్‌ సినిమాకు సీక్వెల్‌గా..
Upendra
Follow us
Basha Shek

|

Updated on: Jul 01, 2023 | 7:18 PM

కన్నడ సూపర్ స్టార్‌ ఉపేంద్ర గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వైవిధ్యమైన కథలతో సినిమాలు తీసే ఈ వెర్సటైల్‌ హీరోకు తెలుగునాట కూడా భారీగా అభిమానులు ఉన్నారు. ఉప్పీ నటించిన కన్నడ డబ్బింగ్‌ సినిమాలు తెలుగులో కూడా సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఈ క్రేజ్‌తోనే రక్తకన్నీరు, కన్యాదానం, సన్నాఫ్‌ సత్యమూర్తి వంటి స్ట్రెయిట్‌ తెలుగు సినిమాల్లోనూ నటించాడు. కేవలం హీరోగానే కాకుండా డైరెక్టర్‌గానూ సత్తా చాటుతున్నాడు ఉపేంద్ర. ఇటీవల కబ్జా అంటూ పాన్‌ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే ఇప్పుడీ లోటును తీర్చుకునేందుకు మరో కొత్త సినిమాను స్టార్ట్‌ చేశాడు ఉపేంద్ర. అదే బుద్ధివంత 2. 2009లో రిలీజై హిట్‌గా నిలిచిన బుద్ధివంత (తెలుగులో బుద్ధిమంతుడు) మూవీకి ఇది సీక్వెల్‌. తాజాగా దీనికి సంబంధించి రిలీజైన ఉపేంద్ర ఫస్ట్‌లుక్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ముఖానికి మాస్క్‌, చిందరవందర జుట్టుతో చాలా డిఫరెంట్‌ లుక్‌తో కనిపించాడు ఉప్పీ.

ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకొంటోన్న బుద్ధివంత 2 సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది. టిఆర్ చంద్రశేఖర్ నిర్మిస్తున్న చిత్రం ‘బుద్ధివంత 2’ చిత్రానికి జయరామ్ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో పాటు ఉపేంద్ర ‘యుఐ’ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?