Parineeti Chopra: కాబోయే భర్తతో కలిసి అక్కడ ప్లేట్లు కడిగిన స్టార్‌ హీరోయిన్‌.. కారణమిదే..

పెళ్లికి ముందు అమృత్‌సర్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌ను దర్శించుకున్నారు పరిణీతి- రాఘవ్. అనంతరం అన్నదాన సత్రంలోకి వెళ్లి ప్లేట్లు కడిగే సేవలో పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

Parineeti Chopra: కాబోయే భర్తతో కలిసి అక్కడ ప్లేట్లు కడిగిన స్టార్‌ హీరోయిన్‌.. కారణమిదే..
Parineeti Chopra
Follow us
Basha Shek

|

Updated on: Jul 01, 2023 | 6:51 PM

ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్ధాతో కలిసి ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న ఈ జంట మే 13న ఉంగరాలు మార్చుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుని తమ బంధాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. త్వరలోనే వీరి వివాహం గ్రాండ్‌గా జరగనుంది. రాజస్థాన్‌లోని ఓ ఫేమస్‌ ప్యాలెస్‌లో పరిణీతి- రాఘవ్‌లు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోనున్నారని సమాచారం. ఈక్రమంలో పెళ్లికి ముందు అమృత్‌సర్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌ను దర్శించుకున్నారు పరిణీతి- రాఘవ్. అనంతరం అన్నదాన సత్రంలోకి వెళ్లి ప్లేట్లు కడిగే సేవలో పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. స్వర్ణదేవాలయం సందర్శన సందర్భంగా పరిణీతి తెల్లటి కుర్తా, సల్వార్ ధరించి తన దుపట్టాతో తల కప్పుకుంది. ఇక ఎంపీ రాఘవ్ తెల్లటి కుర్తా-పైజామాలో బూడిద రంగు నెహ్రూ జాకెట్‌తో కనిపించాడు.

ఇవి కూడా చదవండి

కాగా గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంకా చోప్రాకు చెల్లెలు వరుసయ్యే పరిణీతి చోప్రా 2011లో లేడీస్‌ వర్సెస్‌ రిక్కీ బాల్‌ సినిమాతో బాలీవుడ్‌ తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఇషాక్‌ జాదే, శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌, హస్సీ తో ఫస్సీ, డిష్యూమ్‌, మేరి ప్యార్‌ బిందూ, గోల్‌మాల్‌ అగైన్‌, నమస్తే ఇంగ్లండ్‌, కేసరి, జబ్‌రియా జోడీ, ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌, సైనా తదితర సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా బ్యాడ్మింటన్‌ క్వీన్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ సైనా పరిణీతికి మంచి పేరు తీసుకొచ్చింది. అందులో ఆమె అభినయానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఛమ్కీలా, ది గ్రేట్‌ ఇండియన్‌ రెస్క్యూ సినిమాల్లో నటిస్తోంది పరిణీతి.

View this post on Instagram

A post shared by @parineetichopra

View this post on Instagram

A post shared by @parineetichopra

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.