ICC World Cup 2023: పసికూన చేతిలో ఘోర పరాభవం.. వరల్డ్‌కప్‌ నుంచి వెస్టిండీస్‌ ఔట్.. 48 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా..

ఒకప్పుడు క్రికెట్‌కు పర్యాయపదం వెస్టిండీస్‌. భీకరమైన బౌలింగ్‌, ధాటిగా ఆడే బ్యాటర్లు, కళ్లు చెదిరే ఫీల్డర్లు.. ఇలా అన్ని విభాగాల్లో అత్యంత పటిష్ఠమైన జట్టుగా విండీస్‌ పేరొందింది. ఈక్రమంలోనే 1975, 1979 ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచింది. 1983లో రన్నరప్‌గా నిలిచింది.

ICC World Cup 2023: పసికూన చేతిలో ఘోర పరాభవం.. వరల్డ్‌కప్‌ నుంచి వెస్టిండీస్‌ ఔట్.. 48 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా..
West Indies Cricket
Follow us

|

Updated on: Jul 01, 2023 | 7:52 PM

ఒకప్పుడు క్రికెట్‌కు పర్యాయపదం వెస్టిండీస్‌. భీకరమైన బౌలింగ్‌, ధాటిగా ఆడే బ్యాటర్లు, కళ్లు చెదిరే ఫీల్డర్లు.. ఇలా అన్ని విభాగాల్లో అత్యంత పటిష్ఠమైన జట్టుగా విండీస్‌ పేరొందింది. ఈక్రమంలోనే 1975, 1979 ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచింది. 1983లో రన్నరప్‌గా నిలిచింది. అలా ఒకప్పుడు ప్రత్యర్థులను గజగజా వణికించిన వెస్టిండీస్‌ జట్టు ఇప్పుడు పతనావస్థకు చేరుకుంది. జింబాబ్వేలో జరుగుతున్న ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో సూపర్ సిక్స్ దశలో స్కాట్లాండ్ చేతిలో ఓడిపోయిన వెస్టిండీస్.. భారత్‌లో జరిగే 2023 వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో ఘోరంగా విఫలమైంది . ఈ క్రమంల ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా వెస్టిండీస్ లేకుండా టోర్నీ జరగనుంది. 48 ఏళ్ల క్రితం క్రికెట్ చరిత్రలో తొలి ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్.. తొలిసారి ప్రపంచకప్‌లో ఆడడం లేదు. ప్రపంచకప్ క్వాలిఫయర్‌ టోర్నీలో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. దీంతో ప్రపంచకప్‌కు చేరుకోకముందే తన ప్రయాణాన్ని ముగించింది.

ఆశలు ఆవిరి..

టోర్నీ ఆరంభంలో జింబాబ్వే, ఆ తర్వాత నెదర్లాండ్స్‌ చేతుల్లో ఓటమిపాలైన వెస్టిండీస్ ప్రపంచకప్‌ అవకాశాలు అప్పటికే పతనమయ్యాయి. అయితే స్కాట్లాండ్‌పై భారీ విజయం సాధిస్తే వరల్డ్‌ కప్‌కు అర్హత సాధించే అవకాశం ఉండేది. కానీ ఆ అవకాశాలను చేతులారా చేజార్చుకుంది కరేబియన్‌ జట్టు. మొదట బౌలింగ్ చేసిన స్కాట్లాండ్ వెస్టిండీస్‌ను ఆదిలోనే చిత్తు చేసింది. టోర్నీలో పటిష్టంగా రాణిస్తున్న ఆల్ రౌండర్ బ్రాండన్ మెక్‌ముల్లన్ తన తొలి మూడు ఓవర్లలోనే వెస్టిండీస్‌లోని టాప్ 3 బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించాడు. దీంతో కేవలం 30 పరుగులకే 4 వికెట్లు పడిపోయాయి. ఆ తర్వాత కెప్టెన్ హోప్, నికోలస్ పూరన్ కూడా త్వరగానే ఔటయ్యారు. 21వ ఓవర్‌కు వెస్టిండీస్ స్కోరు 81 పరుగులు మాత్రమే కాగా అప్పటికే 6 వికెట్లు పడిపోయాయి. అయితే జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరి మధ్య 77 పరుగుల భాగస్వామ్యం రావడంతో విండీస్‌ కోలుకుంది. అయితే ఇద్దరు బ్యాటర్లు వరుసగా రెండు ఓవర్లలో ఔట్ కావడంతో జట్టు మొత్తం 181 పరుగులకే కుప్పకూలింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ICC (@icc)

అవమానకరరీతిలో…

182 పరుగుల సులభమైన లక్ష్యాన్ని నిర్దేశించిన స్కాట్లాండ్ జట్టుకు తొలి బంతికే క్రిస్టోఫర్ (0) వికెట్ కోల్పోవడంతో ఆరంభంలోనే షాక్ తగిలింది. ఈ దశలో కలిసి వచ్చిన మాథ్యూ క్రాస్, బ్రాండన్ మెక్‌ముల్లెన్ 125 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ దశలో 69 పరుగుల వద్ద ఉన్న బ్రాండన్ మెక్‌ముల్లెన్ రొమారియో షెపర్డ్‌కు వికెట్ లొంగిపోయాడు. ఈ దశలో చేరిన మాథ్యూ క్రాస్, జార్జ్ మున్సే జాగ్రత్తగా బ్యాటింగ్ ప్రదర్శించారు. ఫలితంగా 3వ వికెట్‌కు 37 పరుగులు జోడించారు. ఈ దశలో మున్సి (18) ఔటయ్యాడు. అయితే మరోవైపు క్రీజులో నిలిచిన మాథ్యూ క్రాస్ విండీస్ ను ఎదుర్కొన్నాడు. అలాగే 43.3 ఓవర్లలో 107 బంతుల్లో అజేయంగా 74 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో స్కాట్లాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విశేషమేమిటంటే.. వెస్టిండీస్‌పై వన్డే క్రికెట్‌లో స్కాట్లాండ్ జట్టుకు ఇదే తొలి విజయం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..