Team India: టీమిండియాకు కొత్త స్పాన్సర్‌.. ఇకపై ఆ లోగో జెర్సీలతో భారత క్రికెటర్లు.. డీల్‌ ఎన్నికోట్లో తెలుసా?

టీమిండియా కొత్త స్పాన్సర్‌గా ఫాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ డ్రీమ్11 ఎంపికైంది. ప్రస్తుతమున్న బైజూస్‌ స్థానంలో నయా స్పాన్సర్‌గా డ్రీమ్‌ 11తో కుదుర్చుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. డ్రీమ్‌ 11 స్పాన్సర్‌షిప్ హక్కులను దాదాపు 358 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ప్రకారం, రాబోయే మూడేళ్లపాటు టీమ్ ఇండియా జెర్సీపై డ్రీమ్11 లోగో కనిపించనుంది.

Team India: టీమిండియాకు కొత్త స్పాన్సర్‌.. ఇకపై ఆ లోగో జెర్సీలతో భారత క్రికెటర్లు.. డీల్‌ ఎన్నికోట్లో తెలుసా?
Team India
Follow us
Basha Shek

|

Updated on: Jul 01, 2023 | 6:11 PM

టీమిండియా కొత్త స్పాన్సర్‌గా ఫాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ డ్రీమ్11 ఎంపికైంది. ప్రస్తుతమున్న బైజూస్‌ స్థానంలో నయా స్పాన్సర్‌గా డ్రీమ్‌ 11తో కుదుర్చుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. డ్రీమ్‌ 11 స్పాన్సర్‌షిప్ హక్కులను దాదాపు 358 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ప్రకారం, రాబోయే మూడేళ్లపాటు టీమ్ ఇండియా జెర్సీపై డ్రీమ్11 లోగో కనిపించనుంది. త్వరలో జరిగే వెస్టిండీస్‌ సిరీస్‌తోనే ఈ ఒప్పందం ప్రారంభమవుతుంది. 2025 వరకు కొనసాగునుంది. దీని ప్రకారం త్వరలో వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లలో టీమిండియా జెర్సీపై డ్రీమ్11 లోగో ప్రదర్శితం కానుంది. ఈ డీల్ గురించి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. ‘డ్రీమ్ 11కి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. BCCI అధికారిక స్పాన్సర్‌షిప్‌తో Dream11 ఇప్పుడు ప్రధాన స్పాన్సర్‌గా ఉంది. మేం ఈ సంవత్సరం చివర్లో ఐసీసీ ప్రపంచ కప్‌ను నిర్వహించడానికి సిద్ధమవుతున్నాం. అభిమానులను మెప్పించడం మా ప్రధాన బాధ్యతల్లో ఒకటి. . డ్రీమ్‌ 11 ఈ భాగస్వామ్యం మాకు సహాయపడుతుందని మేం ఆకాంక్షిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.

ఇక బీసీసీఐతో ఒప్పందంపై డ్రీమ్ స్పోర్ట్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో Mr. హర్ష్ జైన్ మాట్లాడుతూ, BCCI, టీమ్ ఇండియాల దీర్ఘకాల భాగస్వామిగా, మా ఒప్పందాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి Dream11 మరో అడుగు వేసింది. డ్రీమ్11 ద్వారా మేము క్రికెట్ పట్ల ఉన్న ప్రేమను బిలియన్ల కొద్దీ భారతీయ క్రికెట్ అభిమానులతో పంచుకుంటాం. అలాగే జాతీయ జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించడం మాకెంతో గర్వకారణం’ అని తెలిపారు. కాగా జూలై 12 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మొదట 2 టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి టెస్టు జూలై 12 నుంచి 16 వరకు, రెండో టెస్టు జూలై 20 నుంచి 24 వరకు జరగనుంది. దీని తర్వాత మొదటి, రెండో వన్డేలు జూలై 27, 29 తేదీల్లో జరగనున్నాయి. అలాగే మూడో వన్డే ఆగస్టు 1న జరగనుంది. ఇక ఆగస్టు 3 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..