Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhoomam: ఓటీటీలోకి ఫహాద్‌ ఫాజిల్‌ లేటెస్ట్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌.. ‘ధూమమ్‌’ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

ఫాజిల్‌ నటించిన తాజా చిత్రం ధూమమ్‌. యూ టర్న్ ఫేమ్‌ పవన్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కేజీఎఫ్‌, కాంతారా వంటి బ్లాక్ బస్టర్‌ రూపొందించిన హోంబలే ఫిల్మ్స్ ధూమమ్‌ సినిమాను నిర్మించింది. మలయాళంతో పాటు కన్నడ భాషల్లో జూన్‌ 23న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది.

Dhoomam: ఓటీటీలోకి ఫహాద్‌ ఫాజిల్‌ లేటెస్ట్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌.. 'ధూమమ్‌' స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Dhoomam Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 02, 2023 | 8:37 PM

అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమాలోని భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌. అందుకే ఆయన నటించిన పలు డబ్బింగ్ సినిమాలు తెలుగులో కూడా రిలీజవుతున్నాయి. ముఖ్యంగా ఓటీటీల్లో ఫహాద్‌ ఫాజిల్‌ సినిమాలు ఎక్కువగా రిలీజవుతున్నాయి. అలా ఫాజిల్‌ నటించిన తాజా చిత్రం ధూమమ్‌. యూ టర్న్ ఫేమ్‌ పవన్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కేజీఎఫ్‌, కాంతారా వంటి బ్లాక్ బస్టర్‌ రూపొందించిన హోంబలే ఫిల్మ్స్ ధూమమ్‌ సినిమాను నిర్మించింది. మలయాళంతో పాటు కన్నడ భాషల్లో జూన్‌ 23న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ధూమమ్‌ విఫలమైంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌తో తెరకెక్కిన ఈ మూవీ జనాలకు పెద్దగా ఎక్కలేదు. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ధూమమ్‌ ఇప్పుడు డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ ఈ మూవీ  ఓటీటీ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను కొనుగోలు చేసింది. ఈక్రమంలో జులై 21 నుంచి ధూమమ్ సినిమా స్ట్రీమింగ్‌ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ధూమమ్‌ సినిమాలో అపర్ణా బాల మురళి హీరోయిన్‌గా నటించింది. అలాగే అచ్యుత్‌ కుమార్‌, వినీత్‌, జాయ్‌ మాథ్యూ, దేవ్‌ మోహన్‌, అనూ మోహన్‌, నందు ప్రధాన పాత్రల్లో కనిపించారు. మొదట మలయాళం, కన్నడతో పాటు తెలుగు భాషలలోనూ ధూమమ్‌ను రిలీజ్‌ చేయాలని భావించారు మేకర్స్‌. అయితే ఎందుకో వెనకడుగు వేశారు. ఇక స్ట్రీమింగ్‌ విషయంలోనూ తెలుగు వెర్షన్‌ వస్తుందా? లేదా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..