Kiraak RP: చిరంజీవి, బాలయ్య ఇళ్లకు కూడా నా చేపల పులుసు వెళ్లింది.. మియాపూర్‌ బ్రాంచ్‌ ఓపెనింగ్‌లో కిర్రాక్‌ ఆర్పీ

ప్రముఖ కమెడియన్‌ కిర్రాక్‌ ఆర్పీ ప్రారంభించిన చేపల పులుసు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో మూడు బ్రాంచ్‌లు ఓపెన్‌ చేసిన ఆర్పీ ఇటీవల ఆంధ్రాలోనూ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచ్‌ స్టార్ట్‌ చేశాడు. త్వరలోనే విశాఖపట్నం, బెంగళూరులోనూ తన ఫుడ్‌ బిజినెస్‌ సెంటర్లు ప్రారంభిస్తానంటున్నాడు ఆర్పీ.

Kiraak RP: చిరంజీవి, బాలయ్య ఇళ్లకు కూడా నా చేపల పులుసు వెళ్లింది.. మియాపూర్‌ బ్రాంచ్‌ ఓపెనింగ్‌లో కిర్రాక్‌ ఆర్పీ
Kiraak Rp , Balagam Venu
Follow us
Basha Shek

|

Updated on: Jul 02, 2023 | 4:10 PM

ప్రముఖ కమెడియన్‌ కిర్రాక్‌ ఆర్పీ ప్రారంభించిన చేపల పులుసు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో మూడు బ్రాంచ్‌లు ఓపెన్‌ చేసిన ఆర్పీ ఇటీవల ఆంధ్రాలోనూ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచ్‌ స్టార్ట్‌ చేశాడు. త్వరలోనే విశాఖపట్నం, బెంగళూరులోనూ తన ఫుడ్‌ బిజినెస్‌ సెంటర్లు ప్రారంభిస్తానంటున్నాడు ఆర్పీ. ఇదిలా ఉంటే తాజాగా మియాపూర్‌ క్రాస్‌ రోడ్స్‌లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మరో బ్రాంచ్‌ ప్రారంభమైంది. బలగం డైరెక్టర్‌ వేణు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. రిబ్బన్‌ కట్‌ చేసి చేపల పులుసు సెంటర్‌ను ప్రారంభించాడు. అలాగే హీరో అశ్విన్‌తో పాటు పలువురు ప్రముఖులు ఈ ఓపెనింగ్‌ సెర్మెనీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బలగం వేణు కిర్రాక్‌ ఆర్పీ నెల్లూరు చేపల పులుసుకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయాడన్నారు. ‘ కూకట్‌ పల్లిలో మొదలైన ఈ చేపల పులుసు బ్రాంచ్‌ అంచెలంచెలుగా ఎదుగుతోంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. టేస్ట్‌, క్వాలిటీ లేకపోతే ఇన్ని బ్రాంచ్‌లు రావు కదా. జనాన్ని ఆకట్టుకునేందుకు ఆర్పీ చాలా కష్టపడుతున్నాడు. ఇలాగే మా ఆర్పీని, నెల్లూరు చేపల పులుసును ఆశీర్వదించాలి. థ్యాంక్యూ అండ్‌ కంగ్రాచ్చు లేషన్స్‌ ఆర్పీ‘ అని చెప్పుకొచ్చారు వేణు.

ఇక హీరో అశ్విన్‌ మాట్లాడుతూ.. ‘ కిర్రాక్‌ ఆర్పీ కోపిష్టి కావచ్చు. కానీ మనసు బంగారం. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుతో అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. నా ఇంటికి కూడా చేపల పులుసు కూడా పంపించాడు. టేస్ట్‌ చాలా బాగుంది. తాను మరిన్ని బ్రాంచ్‌లు ప్రారంభించాలి. ఆల్‌ ది బెస్ట్‌ ఆర్పీ’ అని విషెస్‌ చెప్పాడు అశ్విన్‌. ఇక ఆర్పీ మాట్లాడుతూ ‘చిరంజీవి, రామ్‌ చరణ్‌, ఉపాసన, ప్రభాస్, శ్రీకాంత్‌ తదితర సినీ ప్రముఖులు చేపల పులుసును టేస్ట్‌ చేశారన్నాడు. అలాగే బాలయ్య ఇంటికి కూడా మా చేపల పులుసు వెళ్లింది. మాదాపూర్‌లో ప్రారంభించిన బ్రాంచ్‌కు కొందరు బాలకృష్ణ మనసులు వచ్చారు. అయితే అప్పటివరకు వారు బాలయ్య మనుషులని నాకు తెలియదు. టేస్ట్‌, క్వాలిటీ బాగుండడంతో బాలయ్య ఇంటి నుంచి వచ్చి మరీ వారు తన చేపల పులుసును తీసుకెళ్లారు’ అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

రేపు మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం