Nenu Student Sir: అఫీషియల్‌.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘నేను స్డూడెంట్ సర్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

బెల్లంకొండ గణేష్‌ నటించిన రెండో చిత్రం 'నేను స్టూడెంట్‌ సర్‌. అలనాటి ప్రముఖ నటి భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దాసాని ఈ మూవీతోనే సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సునీల్‌, సముద్రఖని, శ్రీకాంత్ అయ్యంగార్‌ కీలక పాత్రలు పోషించారు.

Nenu Student Sir: అఫీషియల్‌.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'నేను స్డూడెంట్ సర్‌'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Nenu Student Sir Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 03, 2023 | 8:44 PM

‘స్వాతిముత్యం’ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు బెల్లంకొండ గణేష్. గతేడాది దసరాకు విడుదలైన ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఓటీటీలో మాత్రం సూపర్ రెస్పాన్స్‌ వచ్చింది. ఈనేపథ్యంలో బెల్లంకొండ గణేష్‌ నటించిన రెండో చిత్రం ‘నేను స్టూడెంట్‌ సర్‌. అలనాటి ప్రముఖ నటి భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దాసాని ఈ మూవీతోనే సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సునీల్‌, సముద్రఖని, శ్రీకాంత్ అయ్యంగార్‌ కీలక పాత్రలు పోషించారు. జూన్‌ 2న థియేటర్లలో విడుదలైన నేను స్టూడెంట్ సర్‌ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రెండో సినిమాలోనే గణేష్‌ యాక్షన్‌ మోడ్‌లోకి వెళ్లిపోవడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ నేను స్టూడెంట్‌ సర్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈక్రమంలో జులై 14 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు అధికారికంగా తెలిపింది సదరు ఓటీటీ సంస్థ.

ఈ మేరకు తమ అధికారిక ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ను షేర్‌ చేసింది ఆహా. ‘ ఈ స్టూడెంట్‌ వచ్చేస్తున్నాడు. థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌కు రెడీగా ఉండండి’ అని రాసుకొచ్చింది. నేను స్టూడెంట్ సర్‌ సినిమాను నాంది సతీష్‌ వర్మ నిర్మించారు. మహతి స్వర సాగర్‌ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో ఈ మూవీని మిస్‌ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!