Agent OTT: ‘ఏజెంట్‌’ ఓటీటీ రిలీజ్‌పై అప్‌డేట్‌ ఇచ్చిన ప్రొడ్యూసర్‌.. అక్కినేని అఖిల్‌ సినిమా స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ఇప్పుడు థియేటర్లలో విడుదలైన సినిమాలు నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తున్నాయి. హిట్‌, ప్లాఫ్‌ టాక్‌ తో సంబంధం లేకుండా దాదాపు సినిమాలన్నీ ఇలాగే డిజిటల్‌ ప్రీమియర్‌కు వచ్చేస్తున్నాయి. అయితే అక్కినేని అఖిల్‌ నటించిన ఏజెంట్‌ సినిమా మాత్రం ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ఏప్రిల్‌ 28న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది.

Agent OTT: 'ఏజెంట్‌' ఓటీటీ రిలీజ్‌పై అప్‌డేట్‌ ఇచ్చిన ప్రొడ్యూసర్‌.. అక్కినేని అఖిల్‌ సినిమా స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Agent Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 04, 2023 | 4:54 PM

ఇప్పుడు థియేటర్లలో విడుదలైన సినిమాలు నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తున్నాయి. హిట్‌, ప్లాఫ్‌ టాక్‌ తో సంబంధం లేకుండా దాదాపు సినిమాలన్నీ ఇలాగే డిజిటల్‌ ప్రీమియర్‌కు వచ్చేస్తున్నాయి. అయితే అక్కినేని అఖిల్‌ నటించిన ఏజెంట్‌ సినిమా మాత్రం ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ఏప్రిల్‌ 28న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది. అయితే మొదటి ఆటకే డిజాస్టర్‌ టాక్‌ రావడంతో సినిమా భారీ ప్లాఫ్‌గా నిలిచింది. ఆ వెంటనే మే 19న ఏజెంట్ సినిమాను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీలివ్‌ ప్రకటించింది. అయితే అదేమీ జరగలేదు. జులై వచ్చినా అఖిల్ సినిమా ఓటీటీలోకి రాలేదు. పైగా స్ట్రీమింగ్‌ డేట్‌పై ఎలాంటి అప్‌డేట్‌ కూడా రావడం లేదు. ఈ క్రమంలో ఏజెంట్ ఓటీటీ రిలీజ్‌ ఎందుకు ఆలస్యమవుతుందో అర్థం కాక అభిమానులు అయోమయంలో పడిపోయారు. మరోవైపు ఓటీటీ వ్యూయర్స్‌ కోసం అఖిల్ సినిమాను ఎడిట్‌ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నిర్మాత అనిల్‌ సుంకర మాత్రం ఈ వార్తలను ఖండించాడు.

ఓటీటీ ఆడియెన్స్‌ కోసం ఏజెంట్‌ సినిమాను ఎలాంటి ఎడిటింగ్‌ చేయడం లేదన్నారు అనిల్‌ సుంకర. ఇక సినిమాను రిలీజ్‌ చేయడం తమ చేతుల్లో లేదని సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ చేతుల్లోనే ఉందన్నారు. ఆ సంస్థ ఎప్పుడు అనుకుంటే అప్పుడు స్ట్రీమింగ్‌ చేస్తుందన్నారు. మొత్తానికి ఏజెంట్ ఓటీటీ విడుదల విషయం సోనీలవ్‌ చేతుల్లోనే ఉందని తేల్చేశారు. సో.. ఏజెంట్‌ ఎడిటెడ్‌ వెర్షన్‌ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్‌ నిరాశకు ఇది నిరాశకలిగించే విషయమే. స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి