Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Takkar: ఇట్స్‌ అఫీషియల్‌.. సిద్ధార్థ్ ‘టక్కర్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

లవర్‌ బాయ్‌ సిద్ధార్థ్‌ నటించిన తాజా చిత్రం 'టక్కర్‌'. ఒకప్పుడు ప్రేమకథ చిత్రాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకున్న ఈ నటుడు మొదటిసారి యాక్షన్‌ హీరోగా అవతారమెత్తాడు. అందులో భాగంగా చేసిన సినిమానే 'టక్కర్‌'. కార్తీక్ జీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ డ్రామాలో 'మజిలీ' బ్యూటీ దివ్యాన్ష కౌషిక్‌ కథానాయికగా నటించింది.

Takkar: ఇట్స్‌ అఫీషియల్‌.. సిద్ధార్థ్ 'టక్కర్‌' ఓటీటీ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Takkar Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 05, 2023 | 2:43 PM

లవర్‌ బాయ్‌ సిద్ధార్థ్‌ నటించిన తాజా చిత్రం ‘టక్కర్‌’. ఒకప్పుడు ప్రేమకథ చిత్రాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకున్న ఈ నటుడు మొదటిసారి యాక్షన్‌ హీరోగా అవతారమెత్తాడు. అందులో భాగంగా చేసిన సినిమానే ‘టక్కర్‌’. కార్తీక్ జీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ డ్రామాలో ‘మజిలీ’ బ్యూటీ దివ్యాన్ష కౌషిక్‌ కథానాయికగా నటించింది. కమెడియన్‌ యోగిబాబు, అభిమన్యు సింగ్‌, ఆర్జే విఘ్నేశ్‌కాంత్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. రిలీజ్‌కు ముందు టీజర్లు, ట్రైలర్‌తో టక్కర్‌ సినిమాపై ఆసక్తి కలిగినా తీరా థియేటర్లలోకి వచ్చాక మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. రొటీన్‌ స్టోరీ కావడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు. దీంతో సిద్ధార్థ్‌ ఖాతాలో మరో ప్లాఫ్‌ పడిపోయింది. థియేటర్లలో నిరాశపర్చిన టక్కర్‌ సినిమా ఇప్పుడు డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సిద్ధార్థ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది.

ఈక్రమంలో శుక్రవారం (జులై 7) నుంచి టక్కర్ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. తమిళ్‌తో పాటు తెలుగు భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుంది. కాగా సిద్ధార్థ్‌పై ఉన్న క్రేజ్‌తో టక్కర్‌ సినిమాను తెలుగులో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్ విడుదల చేశాయి. కానీ రిజల్ట్‌ మాత్రం తేడా కొట్టింది. అయితే థియేటర్లలో నిరాశపర్చిన కొన్ని సినిమాలు ఓటీటీలో హిట్‌ అవుతున్నాయి. మరి సిద్ధార్థ్‌ టక్కర్‌ సినిమా కూడా అలా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌