- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan makes a grand debut on Instagram, gains record followers within few hours
Pawan Kalyan: ఇది కదా.. పవర్ స్టార్ క్రేజ్ అంటే.. పవన్ ఎంట్రీతో ఇన్‌స్టాగ్రామ్ షేక్.. రికార్డు స్థాయిలో ఫాలోవర్స్
మంగళవారం పవర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయగా, కొద్దిసేపటికే వెరిఫైడ్ టిక్ కూడా లభించింది. అయితే పవన్ ఖాతాను ఇలా ప్రారంభించారో లేదో ఇన్‌స్టాగ్రామ్ షేక్ అయిపోయింది.
Updated on: Jul 05, 2023 | 7:32 PM

జనసేన అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈరోజు (జులై 7) ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు ఫేస్‌బుక్, ట్విటర్ ద్వారా మాత్రమే ఉపయోగిస్తోన్న ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లోకి కూడా అడుగుపెట్టారు.

మంగళవారం (జులై 4) ఉదయం పవన్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన కొద్ది సేపటికే వెరిఫైడ్ టిక్ కూడా లభించింది.

పవన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించిన కొద్ది గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్‌ను దాటేశారు. ఇప్పటివరకు మొత్తం 1.4 మిలియన్ల మంది ఆయనకు ఫాలోవర్లుగా మారిపోయారు.

కాగా పవన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇప్పటివరకు ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. అయినా గంటల్లోనే మిలియన్ల మంది ఆయనకు ఫాలోవర్లుగా మారిపోయారు.

దీంతో 'ఇది కదా పవర్ స్టార్ క్రేజ్. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు' అంటూ పవన్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు.





























