Good Night: కడుపుబ్బా నవ్వించే గురక.. ఓటీటీలోకి వచ్చేసిన ‘గుడ్‌ నైట్‌’.. తెలుగు వెర్షన్‌ ఎక్కడ చూడొచ్చంటే?

మనలో చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతుంటారు. ఇది మనకు తెలియకపోవచ్చు కానీ పక్కనుండే వాళ్లను మాత్రం చాలా చికాకు పెడుతుంది. ఇప్పుడు ఇదే గురక బ్యాక్‌డ్రాప్‌తో ఓ సినిమా వచ్చింది. అదే గుడ్‌నైట్‌. హీరో గురక వల్ల అతని కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నది ఎంతో ఆసక్తిగా చూపించారు ఈ సినిమాలో.

Good Night: కడుపుబ్బా నవ్వించే గురక.. ఓటీటీలోకి వచ్చేసిన 'గుడ్‌ నైట్‌'.. తెలుగు వెర్షన్‌ ఎక్కడ చూడొచ్చంటే?
Good Night Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 03, 2023 | 6:45 PM

మనలో చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతుంటారు. ఇది మనకు తెలియకపోవచ్చు కానీ పక్కనుండే వాళ్లను మాత్రం చాలా చికాకు పెడుతుంది. ఇప్పుడు ఇదే గురక బ్యాక్‌డ్రాప్‌తో ఓ సినిమా వచ్చింది. అదే గుడ్‌నైట్‌. హీరో గురక వల్ల అతని కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నది ఎంతో ఆసక్తిగా చూపించారు ఈ సినిమాలో. తమిళంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. స్టార్ హీరో, హీరోయిన్లు లేకపోయినా సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో ప్రేక్షకులను బాగా నవ్వించిన గుడ్‌నైట్‌ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈరోజు (జులై 3) నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

గుడ్‌నైట్‌ సినిమాకు వినాయక్ చంద్రశేఖరన్ దర్శకత్వం వహించారు. మణికందన్, మీరా రఘునాథ్ హీరో, హీరోయిన్లుగా నటించారు. అలాగే మేష్ తిలక్, రాయచల్ రెబెక్కా, బాలాజీ శక్తివేల్, భగవతి పెరుమాళ్ ప్రధాన పాత్రలు పోషించారు.యువరాజ్ గణేశన్, మగేష్ రాజ్ పసిలియన్, నజెరత్ పసిలియన్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. మరి కామెడీ సినిమాలు ఎంజాయ్‌ చేసేవారికి గుడ్‌నైట్‌ మంచి ఛాయిస్‌. ఎంచెక్కా ఇంట్లోనే చూసి కడుపుబ్బా నవ్వుకోండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే