Maya Bazaar OTT: ఓటీటీలో నవదీప్, ఈషాల కొత్త వెబ్ సిరీస్ .. ‘మాయాబజార్’ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

హీరో నవదీప్‌ కొద్దిరోజుల క్రితమే న్యూసెన్స్‌ అనే వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించాడు. మీడియా రంగంలోని కొత్త పోకడలను స్పృశిస్తూ తెరకెక్కిన ఈ సిరీస్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు అతను మరోసారి డైరెక్టుగా ఓటీటీ ఆడియెన్స్‌ను పలకరించనున్నాడు. నవదీప్‌ నటిస్తోన్న తాజా వెబ్‌ సిరీస్‌ మాయా బజార్‌.

Maya Bazaar OTT: ఓటీటీలో నవదీప్, ఈషాల కొత్త వెబ్ సిరీస్ .. 'మాయాబజార్' స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Maya Bazaar For Sale Web Series
Follow us
Basha Shek

|

Updated on: Jul 03, 2023 | 3:41 PM

ఫేమ్‌తో సంబంధం లేకుండా సినీ తారలు ఒక్కొక్కరు ఓటీటీల బాట పడుతున్నారు. అగ్రహీరోలు, హీరోయిన్లు కూడా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ సినిమాలు, సిరీస్‌లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇక హీరో నవదీప్‌ కొద్దిరోజుల క్రితమే న్యూసెన్స్‌ అనే వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించాడు. మీడియా రంగంలోని కొత్త పోకడలను స్పృశిస్తూ తెరకెక్కిన ఈ సిరీస్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు అతను మరోసారి డైరెక్టుగా ఓటీటీ ఆడియెన్స్‌ను పలకరించనున్నాడు. నవదీప్‌ నటిస్తోన్న తాజా వెబ్‌ సిరీస్‌ మాయా బజార్‌.. ఫర్‌ సేల్‌ అనేది ట్యాగ్‌లైన్‌. తెలుగమ్మాయి ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే నరేష్‌, ఝాన్సీ, మెయంగ్ చంగ్‌, కోట శ్రీనివాస‌రావు, సునైన‌, హ‌రితేజ‌, రాజా చెంబోలు, ర‌వివ‌ర్మ త‌దిత‌రులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న మాయాబజర్‌ డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్‌ కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో జులై 14 నుంచి మాయాబజార్ స్ట్రీమింగ్‌ కానుంది.

కథేంటంటే?.

మాయా బజార్‌ సిరీస్‌కు గౌత‌మి చల్ల‌గుల్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దగ్గుబాటి రానా స్పిరిట్‌ మీడియా బ్యానర్‌, మిరాజ్‌ మీడియా బ్యానర్‌తో కలిసి రాజీవ్‌ రంజన్‌ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఇక తాజాగా విడుదలైన ఈ సిరీస్‌ ట్రైలర్‌ కడుపుబ్బా నవ్విస్తోంది. మాయాబ‌జార్ అనే గేటెడ్ క‌మ్యూనిటిలో కుటుంబాలు ఎంత విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తుంటాయ‌నే విష‌యాన్ని కామెడీ కోణంలో చూపించారు. కొంద‌రు పిల్లుల్ని పెంచుకుంటుంటారు, కొంద‌రు ఆవుల‌ను పెంచుతుంటారు. ఓ ఇంటావిడైతే మొగుడిపై అనుమానంతో గొడ‌వ ప‌డుతూనే ఉంటుంది. కొంద‌రు చాద‌స్తంగా మాట్లాడుతుంటారు. అయితే వీరంద‌రి క‌లిసి ఉండే గేటెడ్ క‌మ్యూనిటీని ప్ర‌భుత్వ అనుమ‌తి లేని ప్రాంతంలో నిర్మించి ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు మాయాబ‌జార్ గేటెడ్ కమ్యూనిటీలోని ఇళ్ల‌ను కూల్చి వేయాల‌ని బుల్డోజ‌ర్స్‌తో వ‌స్తారు. మరి ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? మాయాబజార్‌ గేటెడ్ కమ్యూనిటీని కాపాడుకున్నారా? అనేది తెలియాలంటే జులై 14న స్ట్రీమింగ్‌ కానున్న మాయా బజార్‌ సిరీస్‌ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే