Tollywood: ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు చిన్నారులు స్టార్ హీరోయిన్స్.. ఎవరో గుర్తుపట్టారా ?..
అందులో ఒకరు అగ్రకథానాయికగా దూసుకుపోతుండగా.. మరొకరు ఒకటి రెండు సినిమాలు చేస్తూ స్టార్ డమ్ కోసం ప్రయత్నిస్తున్నారు. చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్న వీరు.. ఇప్పటికీ పార్టీస్ అంటూ కలుస్తూనే ఉంటారు. ఎవరో గుర్తుపట్టగలరా ?. వారిద్దరూ హీరోయిన్స్..

పైన ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు చిన్నారులు ఇప్పుడు సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్స్. సెలబ్రెటీ ఫ్యామిలీస్ నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. అందులో ఒకరు అగ్రకథానాయికగా దూసుకుపోతుండగా.. మరొకరు ఒకటి రెండు సినిమాలు చేస్తూ స్టార్ డమ్ కోసం ప్రయత్నిస్తున్నారు. చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్న వీరు.. ఇప్పటికీ పార్టీస్ అంటూ కలుస్తూనే ఉంటారు. ఎవరో గుర్తుపట్టగలరా ?. వారిద్దరూ హీరోయిన్స్.. కళ్యాణి ప్రియదర్శన్, కీర్తి సురేష్. ఇద్దరూ తెలుగుతోపాటు..తమిళం, మలయాళం చిత్రాల్లో పనిచేస్తున్నారు. తాజాగా వీరిద్దరు చిన్నప్పటి ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.
ఇదిలా ఉంటే.. నేను శైలజ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్.. ఇప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. మహానటి సినిమాకు నేషనల్ అవార్డ్ అందుకుని … అద్భుతమైన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇటీవలే మామన్నన్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. కోలీవుడ్ హీరో ఉదయనిధి స్టాలిన్ నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇక ప్రస్తుతం ఆమె భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా కనిపించనుంది. అలాగే తమిళంలోనూ నటిస్తుంది.




అలాగే హలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది కళ్యాణి ప్రియదర్శన్. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో కళ్యాణికి ఊహించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఇక ఆ తర్వాత చిత్రలహరి చిత్రంలో నటించింది.కానీ ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు అంతగా విజయం సాధించకపోవడంతో సరైన గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది కళ్యాణి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.