Upasana: ‘హ్యాపీ బర్త్ డే బాబాయ్’.. ఆస్కార్ వీరుడికి వెరైటీగా పుట్టిన రోజు విషెస్ చెప్పిన ఉపాసన
మెగా కపుల్ రామ్ చరణ్- ఉపాసన ఇటీవల అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. తమ 11 ఏళ్ల దాంపత్య బంధానికి ప్రతీకగా జూన్ 20 న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. ఇటీవలే తమ ముద్దుల కూతురికి 'క్లీంకార' గా నామకరణం చేశారు.

మెగా కపుల్ రామ్ చరణ్- ఉపాసన ఇటీవల అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. తమ 11 ఏళ్ల దాంపత్య బంధానికి ప్రతీకగా జూన్ 20 న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. ఇటీవలే తమ ముద్దుల కూతురికి ‘క్లీంకార’ గా నామకరణం చేశారు. కాగా పెళ్లయ్యాక సుమారు 11 ఏళ్లకు రామ్‌చరణ్- ఉపాసనలు తల్లిదండ్రులయ్యారు. దీంతో మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది. ఇక ప్రస్తుతం మాతృత్వాన్ని మనసారా ఆస్వాదిస్తున్నారు ఉపాసన. తన ముద్దుల కూతురి ఆలనాపాలనలో బిజీగా ఉంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారీ మెగా కోడలు. ఈక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి వినూత్నంగా బర్త్‌డే విషెస్ చెప్పారు ఉపాసన. కీరవాణి స్వరాలు సమకూర్చిన నాటు నాటు సాంగ్‌కు ఈ ఏడాది ఆస్కార్ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. అమెరికాలోని లాస్ ఏంజెలిస్ వేదికగా జరిగిన వేడుకల్లో కీరవాణితో పాటు ప్రముఖ గేయ రచయిత ఆస్కార్ అవార్డు అందుకున్నారు.
ఈక్రమంలో కీరవాణికి తనదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ఉపాసన. ఈమేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఒక ఆసక్తికరమైన ఫొటోను షేర్ చేశారామె. అందులో నాటు నాటు సాంగ్‌కు వింబుల్డన్ టెన్నిస్ ఆటగాళ్లు స్పెప్పులేస్తున్నట్లు ఫొటోను డిజైన్ చేశారు. దీనికి ‘హ్యాపీ బర్త్ డే ఎం ఎం కీరవాణి బాబాయ్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఉపాసన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Upasana Post




మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..