Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Thalapathy: విజయ్ దళపతి సినిమాలో గ్లోబల్ స్టార్ ?.. లియో నుంచి మరో క్రేజీ అప్డేట్..

ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ మూవీపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడూ రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కేవలం తమిళ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా.. తెలుగు అడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

Vijay Thalapathy: విజయ్ దళపతి సినిమాలో గ్లోబల్ స్టార్ ?.. లియో నుంచి మరో క్రేజీ అప్డేట్..
Leo Movie Updates
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 04, 2023 | 3:49 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం లియో చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. మాస్టర్ సినిమా తర్వాత డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తోన్న రెండో చిత్రం ఇది. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ మూవీపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడూ రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కేవలం తమిళ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా.. తెలుగు అడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఓ స్టార్ హీరో భాగం కానున్నాడని టాక్ వినిపిస్తుంది. అయితే అతను ఎవరనేదానిపై కొన్ని సస్పెన్స్ నెలకొంది.

అయితే తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. తాజాగా ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రలో గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటివరకు చరణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్టు ఎలాంటి అప్డేట్ లేదు. కానీ కోలీవుడ్ మీడియాలో మాత్రం ఈ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు తెలుగు హీరోలతో పనిచేయాలని ఉందంటూ లోకేష్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు లియో చిత్రంలో చరణ్ గెస్ట్ రోల్ చేయనున్నాడని తెలుస్తోంది. ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది తెలియాలంటే మూవీ టీమ్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

కొద్ది రోజులుగా చరణ్ సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన తన భార్య, కూతురితో సమయాన్ని గడపుతున్నారు. దాదాపు పదకొండేళ్ల తర్వాత చరణ్, ఉపాసన దంపతులకు పాప జన్మించింది. ఆ చిన్నారి పేరు క్లింకారా అని ఇటీవలే మెగా ఫ్యామిలీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో చరణ్.. గేమ్ ఛేంజర్ చిత్రీకరణలో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.