Prabhas: క్రేజీ అప్డేట్.. మరోసారి దేవుడి పాత్రలో డార్లింగ్.. విష్ణువు అవతారంలో ప్రభాస్ ?..

ముఖ్యంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రంపై మరింత హైప్ పెరిగింది. ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తుండడంతో రోజు రోజుకీ ఈ మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, లోకనాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దీంతో ఈ మూవీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు సినీప్రియులు.

Prabhas: క్రేజీ అప్డేట్.. మరోసారి దేవుడి పాత్రలో డార్లింగ్.. విష్ణువు అవతారంలో ప్రభాస్ ?..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 02, 2023 | 6:30 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాల షూటింగ్స్‏లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రంపై మరింత హైప్ పెరిగింది. ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తుండడంతో రోజు రోజుకీ ఈ మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, లోకనాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దీంతో ఈ మూవీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు సినీప్రియులు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తోన్న ప్రాజెక్ట్ కె చిత్రంతో వెండితెరపై నాగ్ అశ్విన్ మ్యాజిక్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం కంప్లీట్ అయ్యిందని చిత్ర నిర్మాత స్వప్నా దత్ తెలిపిన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ కంటే ఎక్కువగా గ్రాఫిక్స్ పూర్తయ్యేందుకే ఎక్కువ సమయం పట్టేలా తెలుస్తోంది.

ఇక కొద్ది రోజులుగా ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ముందుగా ఇందులో కమల్ హాసన్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని టాక్ నడిచింది. ఇప్పుడు ఈ మూవీలోని ప్రభాస్ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం.. ఈ మూవీలో పురాణాలకు సంబంధించిన అంశం ఉంటుందట. దీనికి అనుగణంగా ప్రభాస్ రోల్ పై వార్త వినిపిస్తుంది. ఇందులో ప్రభాస్ విష్ణు అవతారంలో కనిపించనున్నాడట. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు.. కానీ ప్రభాస్ విష్ణు పాత్రలో కనిపించనున్నాడని తెలిసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ క్యూరియాసిటిని పెంచాయి. ఇక ఈసినిమాతోపాటు.. ప్రభాస్ సలార్ చిత్రంలోనూ నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?