Pawan Kalyan Fans: తొలిప్రేమ రీరిలీజ్..! థియేటర్ స్క్రీన్ చించేసి., అభిమానుల బీభత్సం.
బెజవాడలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. తొలిప్రేమ సినిమా రీరిలీజ్ రోజున విజయవాడలోని కపర్ది థియేటర్‌లో స్క్రీన్ చించేసి, కూర్చీలు విరగ్గొట్టి నానా భీభత్సం సృష్టించారు. తొలిప్రేమ రీరిలీజ్‌తో 6 లక్షల నష్టం వాటిల్లిందని లబోదిబో మంటున్నారు థియేటర్ యజమానులు.
బెజవాడలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. తొలిప్రేమ సినిమా రీరిలీజ్ రోజున విజయవాడలోని కపర్ది థియేటర్‌లో స్క్రీన్ చించేసి, కూర్చీలు విరగ్గొట్టి నానా భీభత్సం సృష్టించారు. తొలిప్రేమ రీరిలీజ్‌తో 6 లక్షల నష్టం వాటిల్లిందని లబోదిబో మంటున్నారు థియేటర్ యజమానులు. ఇక అభిమానం ఉండాలి కానీ.. అది హద్దులు దాటకూడదని.. పవన్ కల్యాణ్ లార్జర్ దెన్ లైఫ్ ఉన్న కథానాయకుడని.. ఇప్పడిప్పుడే పాలిటిక్స్‌లోనూ తన మార్క్ కూడా చూపిస్తున్నారని.. ఆయన ఫ్యాన్స్ పలువురికి ఆదర్శంగా ఉండాలే కానీ.. ఇలా నలుగురితో మాటలు పడే విధంగా చేయడం కరెక్ట్ కాదని.. ఆయన మంచి కోరే హితులు చెబుతున్నారు.
ఇక పవన్ కెరీర్‌లో కల్ట్ క్లాసిక్ మూవీ ‘తొలిప్రేమ’. ఈ మూవీ జూన్ 30 శుక్రవారం రీ-రిలీజ్ అయ్యింది. దీంతో అభిమానులు థియేర్లకు పోటెత్తారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ ఈ సినిమా క్లిప్స్‌తో నిండిపోయాయి. అభిమానులు 25 సంవత్సరాల తర్వాత 4kలో ఈ సినిమాను ఎంజయ్ చేస్తూ.. కేకలు, స్లోగన్స్‌తో రచ్చ చేశారు. 1998లో రిలీజయిన ‘తొలి ప్రేమ’ సినిమాలో కీర్తి రెడ్డి పవన్ సరసన్ నటించింది. దర్శకుడు కరుణాకరన్‌కు ఈ సినిమాతో ఓ రేంజ్‌లో పేరు వచ్చింది. ఈ మూవీ తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును.. ఆరు రాష్ట్రాల నంది అవార్డులను గెలుచుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

