Peddha Kapu: ‘ఆ జెండా చూడాలంటే.. కచ్చితంగా తలెత్తే చూడాలి’.. ‘పెద్ద కాపు’ టీజర్‌ చూశారా?

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం, ముకుంద, నారప్ప సినిమాలతో ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీకాంత్ అడ్డాల. కెరీర్‌లో ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలే చేసిన ఆయన నారప్ప మూవీతో మాస్‌ మంత్రం జపించారు. ఇప్పుడు అంతకు మించి అనే ఉండేలా మరో యాక్షన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Peddha Kapu: 'ఆ జెండా చూడాలంటే.. కచ్చితంగా తలెత్తే చూడాలి'.. 'పెద్ద కాపు' టీజర్‌ చూశారా?
Peddha Kapu Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 02, 2023 | 6:16 PM

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం, ముకుంద, నారప్ప సినిమాలతో ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీకాంత్ అడ్డాల. కెరీర్‌లో ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలే చేసిన ఆయన నారప్ప మూవీతో మాస్‌ మంత్రం జపించారు. ఇప్పుడు అంతకు మించి అనే ఉండేలా మరో యాక్షన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కొత్త కుర్రాడు విరాట్‌ కర్ణను హీరోగా పరిచయం చేస్తూ ఆయన తెరకెక్కిస్తోన్న సినిమా పెద కాపు. సామాన్యుడి సంతకం అనేది ట్యాగ్‌ లైన్‌. మొత్తం రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా నటిస్తోంది. అనసూయ, నాగబాబు, రావు రమేశ్‌, రాజీవ్ కనకాల, ఈశ్వరి రావు, నరేన్, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా పెద కాపు-1 టీజర్‌ రిలీజైంది. సీనియర్‌ ఎన్టీఆర్‌ పొలిటికల్‌ స్పీచ్‌తో ఈ టీజర్‌ మొదలైంది. ఒక ఊరిలోని ఇద్దరు పెద్ద మనుషుల ఆధిపత్య పోరు, వారి వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులు, హీరో వారిపై ఎలా తిరగబడ్డాడు? అనేది స్టోరీలైన్‌ అర్థమవుతోంది. ఇక ఇందులోని డైలాగులు బాగానే పేలాయి. ‘ఇది కేవలం జెండా కాదు.. మన ఆత్మ గౌరవం, ‘ మా నాన్న ఎప్పుడూ ఒక మాట చెబుతుండే వాడు. బాగా బతకడమంటే నిన్నటి కంటే ఇయాల బాగుండాలి, ఇయాలి కంటే రేపు బాగుండాలి’, ‘వాళ్లు పెట్టిన జెండా చూడాలంటే, కచ్చితంగా తలెత్తే చూడాలి’ వంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.పెద్ద కాపు సినిమాలో శ్రీకాంత్ అడ్డాల కూడా ఒక పాత్రలో నటిస్తున్నాడు.

టీజర్‌ చివరిలో శ్రీకాంత్ సడెన్‌ గా ప్రత్యక్షమై సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు శ్రీకాంత్. బాలయ్య అఖండతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న మిర్యాల రవీందర్ రెడ్డి పెద కాపు సినిమాను నిర్మిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూరుస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.