Ram Charan: వాటే ఐడియా సర్ జీ.. ఆ బ్రాండ్ కోసం రామ్ చరణ్ యాడ్.. సరికొత్త ప్రమోషన్ వీడియో..

అందుకే పెద్ద మొత్తంలో ఖర్చు చేసి మరీ స్టార్స్ తో యాడ్స్ చేయిస్తుంటారు. ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు పలు బ్రాండ్లకు అంబాసిడర్‏గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సైతం పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్. అందులో ఒకటి మీషో. ఇప్పటికే సంస్థకు ఉత్పత్తులకు యాడ్ చేశారు చరణ్.

Ram Charan: వాటే ఐడియా సర్ జీ.. ఆ బ్రాండ్ కోసం రామ్ చరణ్ యాడ్.. సరికొత్త ప్రమోషన్ వీడియో..
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 04, 2023 | 9:18 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది హీరోస్ వ్యాపారరంగంలోనూ సత్తా చాటుతున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు యాడ్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇక పలు కమర్షియల్ బిజినెస్ కంపెనీలు సైతం హీరోలతో తమ బ్రాండ్ యాడ్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక సెలబ్రెటీస్ చేసే యాడ్స్ చూసి వినియోగదారులు సైతం ఆ ఉత్పత్తులు తీసుకోవడానికే ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే పెద్ద మొత్తంలో ఖర్చు చేసి మరీ స్టార్స్ తో యాడ్స్ చేయిస్తుంటారు. ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు పలు బ్రాండ్లకు అంబాసిడర్‏గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సైతం పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్. అందులో ఒకటి మీషో. ఇప్పటికే సంస్థకు ఉత్పత్తులకు యాడ్ చేశారు చరణ్.

గతంలో ఒక్కో భాషలో ఒక్కో హీరోతో బ్రాండ్ యాడ్ చేయించింది ఈ ఆన్ లైన్ సేల్స్ యాప్. అలా తెలుగులో రామ్ చరణ్..మీషోకు అంబాసిడర్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు సరికొత్తగా ప్రమోషన్ చేసింది మీషో. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. అందులో యాడ్ ప్రారంభం కాగానే.. సర్ టార్గెట్ చూశాను అంటూ చరణ్ మరో వ్యక్తికి ఫోన్ లో చెప్పగా.. ఏజెంట్ అతను ఏం వేసుకున్నాడు అంటూ అవతలి వ్యక్తి అడుగుతాడు. ఇక అతడి వెనకే చెర్రీ ఫాలో అవుతూ.. బ్లూ జీన్స్ బ్లాక్ చాకెట్.. జాకెట్ ప్రీమియంగాఉంది.. సాఫ్ట్, కోజీగా ఉంది. అతడికి బాగా సూట్ అయ్యింది.. అబ్బాయి కొంచెం సెక్సీగా ఉన్నాడు సర్ అంటూ చెబుతాడు.

ఇవి కూడా చదవండి

ఇక అతడి జీన్స్ గురించి చెప్పమని అడగ్గానే..అతడిని పట్టుకుని ఎంతకు తీసుకున్నావ్ జాకెట్ రూ.6 వేలకా అని అడుగుతాడు. వెంటనే ఆ వ్యక్త రూ.600 అని చెప్పగా.. ఎక్కడి నుంచి అనగానే సదరు బ్రాండ్ పేరు చెబుతాడు. వివరాలు తెలుసుకుని వెళ్లిపోతాడు చరణ్. ఇలా యాడ్ ముగుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక ఇదే బ్రాండ్ కు హిందీలో రణవీర్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్ కాగా.. కొద్ది రోజుల క్రితం ఈ యాడ్ ప్రోమో షేర్ చేస్తూ.. సస్పెన్స్ క్రియేట్ చేశారు రణవీర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.