Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌తో ఉన్న ఈ పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరో.. ఎవరో గుర్తుపట్టారా మరి?

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉండే ఎంతోమంది యంగ్‌ హీరోలు పవన్‌ను అమితంగా అభిమానిస్తారు. అతనినే ఆదర్శంగా తీసుకుని సినిమాలు చేస్తున్నారు. అలా ఒక యంగ్‌ హీరో చిన్నప్పుడు పవన్‌తో దిగిన ఒక ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌తో ఉన్న ఈ పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరో.. ఎవరో గుర్తుపట్టారా మరి?
Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Jul 05, 2023 | 9:06 PM

పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలు చేసినా, చేయకపోయినా అతని ఫాలోయింగ్‌ ఏ మాత్రం తగ్గదు. పైగా రోజురోజుకీ పవర్‌ స్టార్‌ పాపులారిటీ పెరిగిపోతోంది. మంగళవారం (జులై 4) అలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ అయ్యాడో లేదో దెబ్బకు రికార్డు స్థాయిలో ఫాలోవర్లు వచ్చి చేరారు. పవన్‌ క్రేజ్‌కు ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉండే ఎంతోమంది యంగ్‌ హీరోలు పవన్‌ను అమితంగా అభిమానిస్తారు. అతనినే ఆదర్శంగా తీసుకుని సినిమాలు చేస్తున్నారు. అలా ఒక యంగ్‌ హీరో చిన్నప్పుడు పవన్‌తో దిగిన ఒక ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. చూడగ్గానే ఆ పిల్లాడిని గుర్తుపట్టడం కాస్త కష్టమే. అతను ఇప్పుడు సోలో హీరోగానూ, స్పెషల్ రోల్స్‌లోనూ సందడి చేస్తున్నాడు. అ కథానాయకుడు మరెవరో కాదు.. ఇటీవలే ‘మాయాపేటిక’ సినిమాతో మనల్ని పలకరించిన విరాజ్‌ అశ్విన్‌. అతను తాజాగా సోషల్‌ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. అందులో ఈ ఫొటోను షేర్‌ చేసుకోగా అది కాస్తా వైరలైంది.

దీంతో పాటు మరొక ఫొటోను షేర్‌ చేశాడు విరాజ్‌. అందులో పవన్‌ ‘తొలి ప్రేమ’ రి రిలీజ్‌ పోస్టర్‌ పక్కనే తన ‘మాయాపేటిక’ సినిమా పోస్టర్‌ ఉంది. ఇలా తనకెంతో ఇష్టమైన హీరో పోస్టర్‌ పక్కనే తన సినిమా పోస్టర్‌ చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు విరాజ్‌. ‘ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉండడానికి ఆయనే స్ఫూర్తి. పవన్‌ని మళ్లీ కలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని ట్విట్టర్‌లో తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు విరాజ్‌. ఈ యంగ్‌ హీరో గతంలో అనసూయ ‘థ్యాంక్యూ బ్రదర్‌’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత సోలో హీరోగా ‘వాళ్లిద్దరి మధ్య’, ‘మనసానమ:’ వంటి సినిమాల్లో కనిపించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..