AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supritha Dance: పవన్‌ కల్యాణ్‌ ‘బంగారం’ పాటకు సురేఖవాణి కూతురు డ్యాన్స్‌.. వైరల్ వీడియో చూశారా?

సురేఖ వాణి.. ఈ మధ్యన సినిమాలు చేయకున్నా ఈ నటి పేరు ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. డ్రగ్స్‌తో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన కబాలి తెలుగు నిర్మాత కేపీ చౌదరితో సురేఖ వాణి దిగిన ఫొటోలు తెగ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. సురేఖతో పాటు ఆమె కూతురు సుప్రిత కూడా కేపీ చౌదరితో దిగిన ఫొటోలు నెట్టింట వైరలయ్యాయి.

Supritha Dance: పవన్‌ కల్యాణ్‌ 'బంగారం' పాటకు సురేఖవాణి కూతురు డ్యాన్స్‌.. వైరల్ వీడియో చూశారా?
Surekha Vani Daughter Supritha
Basha Shek
|

Updated on: Jul 05, 2023 | 8:40 PM

Share

సురేఖ వాణి.. ఈ మధ్యన సినిమాలు చేయకున్నా ఈ నటి పేరు ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. డ్రగ్స్‌తో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన కబాలి తెలుగు నిర్మాత కేపీ చౌదరితో సురేఖ వాణి దిగిన ఫొటోలు తెగ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. సురేఖతో పాటు ఆమె కూతురు సుప్రిత కూడా కేపీ చౌదరితో దిగిన ఫొటోలు నెట్టింట వైరలయ్యాయి. దీంతో డ్రగ్స్‌ కేసులో తల్లీ కూతుళ్లు ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే డ్రగ్స్‌ కేసుతో తమ కెలాంటి సంబంధం లేదంటూ వీడియో రిలీజ్‌ చేసి క్లారిటీ ఇచ్చింది సురేఖ వాణి. ఈ సంగతి పక్కన పెడితే సామాజిక మాధ్యమాల్లో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటారు సురేఖవాణి, ఆమె కూతురు సుప్రిత. సూపర్‌హిట్ సినిమాల్లోని పాటలకు తమదైన శైలిలో డ్యాన్స్‌లు చేస్తూ ఆ వీడియోలను నెట్టింట షేర్‌ చేస్తుంటారీ తల్లీ కూతుళ్లు. నెట్టింట ట్రోల్స్‌ వస్తున్నా వీరికి ఫాలోయింగ్‌ బాగానే ఉంది. ఇక సుప్రియ కూడా తన ఫొటోషూట్స్‌, హాట్‌ డ్యాన్స్‌లతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఈక్రమంలో  ‘సురేఖ వాణి కూతురు షేర్‌ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

పవన్‌ కల్యాణ్‌ నటించిన బంగారం సినిమాలోని ‘చెడుగుడంటే భయ్యం’ పాటలోని కొన్ని లిరిక్స్‌కు తనదైన శైలిలో స్టెప్పులేసింది సుప్రిత.పెద్దగా డ్యాన్స్‌ చేయకపోయినా లిరిక్స్‌కు తగ్గట్టుగా కళ్లు తిప్పుకోలేని క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చింది. ‘తాడు బొంగరం, తళా తళా ఉంగరం, నెల్లూరు పొంగణం, మామిడాల సంబరం’ అనే లిరిక్స్‌కు సుప్రిత ఇచ్చిన హావభావాలు కుర్రకారును తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా తల్లి సురేఖ లాగానే సుప్రిత కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే సోషల్‌ మీడియా ద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకుంటోందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి