Bhavana: మరింత అందంగా మారిపోయిన ‘ఒంటరి’ హీరోయిన్ భావన.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ఒంటరి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది మలయాళ నటి భావన. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత హీరో, నిప్పు, మహాత్మ సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైంది.
Updated on: Jul 05, 2023 | 10:15 PM

ఒంటరి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది మలయాళ నటి భావన. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత హీరో, నిప్పు, మహాత్మ సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైంది.

కాగా తెలుగులో తక్కువ సినిమాలు చేసిన భావన కన్నడ, మలయాళ సినిమాల్లో ఎక్కువ సినిమాలు చేసింది. ముఖ్యంగా మలయాళంలో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకుంది.

అయితే ఆ మధ్యన భావన జీవితంలో అనుకోని సమస్యలు ఎదురయ్యాయి. అయితే మొక్కవోని ధైర్యంతో వాటిని ఎదుర్కొందీ అందాల తార. ప్రస్తుతం ఆమె చేతిలో 4 సినిమాలు ఉన్నాయి.

ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది భావన. తరచూ తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటుంది.

అలా తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వాటిని చూసిన నెటిజన్లు భావన అందం ఏ మాత్రం తగ్గడం లేదంటూ ప్రశంసల కురిపిస్తున్నారు.