TOP 9 ET: హాలీవుడ్ గడ్డపై.. ప్రభాస్‌ రేర్ రికార్డ్ | 85 మిలియన్లు.. చరిత్రకెక్కిన ప్రభాస్.

TOP 9 ET: హాలీవుడ్ గడ్డపై.. ప్రభాస్‌ రేర్ రికార్డ్ | 85 మిలియన్లు.. చరిత్రకెక్కిన ప్రభాస్.

Anil kumar poka

|

Updated on: Jul 07, 2023 | 7:54 PM

భోళా శంకర్‌ డబ్బింగ్ వర్క్‌ పూర్తి చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న మెగాస్టార్‌, సినిమా అద్భుతంగా వచ్చిందన్నారు. తమిళ బ్లాక్ బస్టర్ వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మెహర్‌ రమేష్ దర్శకుడు.

01. Project K
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే సినిమా రిలీజ్‌కు ముందే సంచలనాలు క్రియేట్‌ చేస్తోంది. ఈ సినిమా టైటిల్‌, ట్రైలర్‌, రిలీజ్ డేట్‌లను ప్రతిష్టాత్మక సాండియాగో కామికాన్‌లో జూలై 20న రివీల్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేయడం ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది ప్రాజెక్ట్ కే.

02. Prabhas
ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్ నుంచి తాజాగా రిలీజ్ అయిన టీజర్ దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. అందరూ అనుకున్నట్టే.. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే అందరి హీరోల టీజర్స్‌లాగే.. మిలియన్ల వ్యూస్ వచ్చేలా చేసుకుంది. కానీ ఆ తరువాత ఒక్క సారిగా సలార్ మేనియా విస్పోటనమైంది. ఎవ్వరూ ఊహించని మైల్ స్టోన్‌కు రీచైపోయింది. ఇండియాన్ సినిమాస్ టాప్‌ హీరోలందరి రికార్డును ఒక్క అడుగుతో దాటేసింది. ఏకంగా 24 గంటల్లోనే 83 మిలియన్‌ ప్లస్‌ వ్యూస్ ను వచ్చేలా చేసుకుంది. ఇండియాలోనే.. మోస్ట్ వ్యూవ్‌డ్‌ టీజర్‌గా… రికార్డ్‌ కెక్కింది. నయా హిస్టరీ క్రియేట్ చేసింది మన ప్రభాస్‌ సలార్ టీజర్‌.

03.Bhola Shankar
భోళా శంకర్‌ డబ్బింగ్ వర్క్‌ పూర్తి చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న మెగాస్టార్‌, సినిమా అద్భుతంగా వచ్చిందన్నారు. తమిళ బ్లాక్ బస్టర్ వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మెహర్‌ రమేష్ దర్శకుడు. కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు. చిరుకు జోడిగా తమన్నా నటించారు. యంగ్ హీరో సుశాంత్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

04.Chiranjeevi
ఇక భోళా డబ్బింగ్ అలా పూర్తి చేశారో లేదో.. ఇలా హాలీడే కోసం యుఎస్‌ ప్రయాణమయ్యారు మెగాస్టార్ చిరు. తన భార్య సురేఖతో కలిసి ట్రిప్‌కు వెళుతున్నట్టు.. తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు. దాంతో పాటే.. ప్లైట్‌లోకి కొన్ని ఫోటోలను తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ కోసం షేర్ చేశారు. అంతేకాదు.. తన నెక్ట్స్ ఫిల్మ్ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఉంటుందని హింట్ కూడా ఇచ్చారు మెగాస్టార్.

05.krithi
తనమీద కొన్నాళ్లుగా జరుగుతున్న వదంతులకు ఫుల్‌స్టాప్‌ పెట్టమని ట్వీట్‌ చేశారు కృతి శెట్టి. ఓ స్టార్‌ హీరో కొడుకు ఆమెను వేధిస్తున్నారంటూ కొన్నాళ్లుగా వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అందులో నిజం లేదని, అసత్య ప్రచారాన్ని ఆపాలని కోరారు కృతి శెట్టి. పట్టించుకోకుండా వదిలేద్దామనుకున్నప్పటికీ, నానాటికీ పెరుగుతున్న ఒత్తిడితో స్పందించాల్సి వచ్చిందని చెప్పారు.

06.aadikesava
పంజా వైష్ణవ్‌తేజ్‌హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఆదికేశవ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ నిర్మిస్తున్నాయి. శ్రీకర స్డూడియోస్‌ సమర్పిస్తోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ జోనర్‌లో ఉంటుంది. ఆగస్టు 18న విడుదల కానుంది. శ్రీలీల ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

07.Jawan
షారుఖ్‌ఖాన్‌ హీరోగా నటిస్తున్న సినిమా జవాన్‌. అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార నాయిక. ఈ సినిమాలో షారుఖ్‌ ఆరు డిఫరెంట్‌ గెటప్పుల్లో కనిపిస్తారట. త్వరలోనే జవాన్‌ ట్రైలర్‌ విడుదల కానుంది. విజయ్‌ సేతుపతి ఇందులో విలన్‌గా కనిపిస్తారు. సెప్టెంబర్‌ 7న విడుదల కానుంది జవాన్‌.

08.yash
యష్‌ కథానాయకుడిగా నటించిన కేజీయఫ్‌ రెండు భాగాలు జపాన్‌లో విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో యష్‌ ఓ స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేశారు. జులై 14న అందరూ రెడీగా ఉండండి. మా యాక్షన్‌ మూవీస్‌ మిమ్మల్ని అలరిస్తాయి అంటూ కేజీయఫ్‌ గురించి చెప్పారు. ప్రశాంత్‌ నీల్‌ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌ ఫ్యాన్స్ ఉన్నారు.

09.Jailer
రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన కామెడీ థ్రిల్లర్ మూవీ జైలర్‌. ఈ సినిమాలోని వా.. నువ్వు కావాలయ్యా సాంగ్‌ని రిలీజ్‌ చేసింది టీమ్‌. ఫస్ట్ నుంచి ఈ పాటను తమన్నా సాంగ్‌ అనే ప్రమోట్‌ చేస్తున్నారు మేకర్స్. దానికి తగ్గట్టే పాటలో తమన్నా స్టెప్పులు ఆకట్టుకున్నాయి. తెలుగు, తమిళ పదాల కలగలుపుగా సాగుతుంది ఈ పాట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...