IB71 OTT: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్‌ ఇంటెన్స్‌ స్పై థ్రిల్లర్‌.. ‘ఐబీ71’ తెలుగు వెర్షన్‌ ఎక్కడ చూడొచ్చంటే?

ఘాజీ, అంతరిక్షం సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సంకల్ప్‌ రెడ్డి. తనదైన టేకింగ్‌తో ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ఐబీ 71. ఇండియాస్ టాప్‌ సీక్రెట్‌ మిషన్‌ అనేది ఉప శీర్షిక.

IB71 OTT: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్‌ ఇంటెన్స్‌ స్పై థ్రిల్లర్‌.. 'ఐబీ71' తెలుగు వెర్షన్‌ ఎక్కడ చూడొచ్చంటే?
Ib71 Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 08, 2023 | 3:49 PM

ఘాజీ, అంతరిక్షం సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సంకల్ప్‌ రెడ్డి. తనదైన టేకింగ్‌తో ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ఐబీ 71. ఇండియాస్ టాప్‌ సీక్రెట్‌ మిషన్‌ అనేది ఉప శీర్షిక. ఎన్టీఆర్‌ శక్తి, ఊసరవెల్లి సినిమాల్లో పవర్‌ ఫుల్‌ విలన్‌గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విద్యుత్‌ జమ్వాల్‌ ఇందులో హీరోగా నటించాడు. 1971లో ఇండియన్ ఏజెంట్స్, పాకిస్తాన్ లోకి వెళ్లి చేసిన ఒక మిషన్ ఆధారంగా సంకల్ప్‌ రెడ్డి ఐబీ 71ను తెరకెక్కించాడు. మే 12న థియేటర్లలో విడుదలైన ఈ స్పై థ్రిల్లర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్‌ వద్ద బాగానే కలెక్షన్లు రాబట్టింది. థియేటర్లలో ఆకట్టుకున్న ఐబీ 71 ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ఈ స్పై థ్రిల్లర్‌ డిజిటల్‌ రైట్స్‌ను కొనుగోలు చేసింది. ఈక్రమంలో ఒప్పందం ప్రకారం శుక్రవారం (జులై 7) నుంచి ఐబీ 71ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

కాగా స్ట్రీమింగ్‌ డేట్‌ ప్రకటించే సమయంలో ఐబీ 71 వెర్షన్‌పై క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడీ సినిమా హిందీతో పాటు తెలుగు వెర్షన్‌ కూడా అందుబాటులో ఉంది. ఇందులో అనుపమ్‌ ఖేర్‌, విశాల్‌ జెత్వా, ఫైజాన్‌ ఖాన్‌, అశ్వంత్‌ భట్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్‌ ఆర్‌. విహారి బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించారు. టీ- సిరీస్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. ఈ వీకెండ్‌లో మంచి ఇంటెన్స్‌ థ్రిల్లింగ్‌ సినిమా చూడాలనుకునేవారికి ఐబీ 71 మంచి ఛాయిస్‌ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం