Takkar Movie: ఓటీటీలోకి వచ్చేసిన సిద్ధార్థ్ టక్కర్.. ఎక్కడ చూడొచ్చంటే..
మహా సముద్రం సినిమా తర్వాత సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. డైరెక్టర్ కార్తీక్ జీ క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే మరోసారి ఈమూవీకి మిశ్రమ స్పందన లభించింది. అయితే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
ఒకప్పుడు లవర్ బాయ్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో సిద్ధార్థ్. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న హీరో.. ఆ తర్వాత వరుసగా డిజాస్టర్స్ ఖాతాలో వేసుకున్నారు. దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే సిద్ధార్థ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. మహా సముద్రం సినిమా తర్వాత సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. డైరెక్టర్ కార్తీక్ జీ క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే మరోసారి ఈమూవీకి మిశ్రమ స్పందన లభించింది. అయితే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో తమిళంతోపాటు.. తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
మాస్ యాక్షన్ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమాలో సిద్ధార్థ్ సరసన దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటించింది. అలాగే ఇందులో అభిమన్యు సింగ్, యోగి బాబు, మునిష్కాంత్, ఆర్జే విఘ్నేష్ కాంత్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ తో కలిసి స్టూడియోస్ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి నివాస్ కె ప్రసన్న సంగీతం అందించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.