AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sana Khan: ‘అమ్మయ్యానోచ్‌’.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌.. ఆనందక్షణాలను పంచుకుంటూ ఎమోషనల్

కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన 'కత్తి' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది ముంబై ముద్దుగుమ్మ సనాఖాన్‌. ఆ తర్వాత నాగార్జున గగనం, మంచు మనోజ్‌ మిస్టర్‌ నూకయ్య సినిమాలతో ఇక్కడి వారికి బాగా చేరువైంది. ఇక హిందీలో సల్మాన్‌ ఖాన్‌ వంటి స్టార్‌హీరోల సినిమాల్లో సందడి చేసింది.

Sana Khan: 'అమ్మయ్యానోచ్‌'.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌.. ఆనందక్షణాలను పంచుకుంటూ ఎమోషనల్
Sana Khan
Basha Shek
|

Updated on: Oct 02, 2023 | 11:00 PM

Share

కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన ‘కత్తి’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది ముంబై ముద్దుగుమ్మ సనాఖాన్‌. ఆ తర్వాత నాగార్జున గగనం, మంచు మనోజ్‌ మిస్టర్‌ నూకయ్య సినిమాలతో ఇక్కడి వారికి బాగా చేరువైంది. ఇక హిందీలో సల్మాన్‌ ఖాన్‌ వంటి స్టార్‌హీరోల సినిమాల్లో సందడి చేసింది. అయితే స్టార్‌ హీరోయిన్‌గా కెరీర్‌ ఫుల్‌ స్పీడ్‌ ఉంటున్న తరుణంలోనే సినిమా ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పింద సనాఖాన్‌. అప్పటికప్పుడు తన సోషల్‌ మీడియా ఖాతాల్లో ఉన్న సినిమా ఫొటోలన్నింటినీ డిలీట్‌ చేసింది. ఆమె నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆ తర్వాత ఇస్లాం మతంలోకి పూర్తిగా మారిపోయి మరోసారి వార్తల్లో నిలిచింది. ఇక 2020లో అనాస్‌ సయ్యద్‌ని పెళ్లి చేసుకున్న ఆమె తన మకాన్ని పూర్తిగా దుబాయ్‌కి మార్చేసింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సనాఖాన్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తన భర్తతో కలిసున్న ఫొటోలను తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తుంటుంది.

కొన్ని నెలల క్రితం తాను గర్భంతో ఉన్నానని చెప్పుకొచ్చింది సనాఖాన్‌. తాజాగా తాను అమ్మనయ్యానంటూ శుభవార్తను మోసుకొచ్చింది. తనకు పండంటి మగబిడ్డ జన్మించినట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేసింఇ సనాఖాన్‌ ‘ఇప్పటి వరకు మీ ప్రేమాభిమానాలు మాపై ఉంచినందుకు కృతజ్ఞతలు. మీ ప్రేమాభిమానాలు మా బిడ్డపై కూడా చూపాలని మనసారా కోరుకుంటున్నాను’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది సనాఖాన్‌. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువుఉరు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సనాఖాన్‌ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!