Actress Kajol: వివాదంలో చిక్కుకున్న కాజోల్.. చదువులేని లీడర్స్ పాలిస్తున్నారన్న వ్యాఖ్యలపై వివరణ
ఈ సందర్భంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ కాజోల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రాజకీయ నాయకుల గురించి కాజోల్ మాట్లాడటంపై కొందరు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రాజకీయ నాయకులకు సరైన చదువు లేదంటూ కాజోల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి కారణమైంది.
బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ ఓ వైపు సినిమాలతో మరోవైపు వెబ్ సిరీస్ తో బిజీబిజీగా ఉంది. అందం, అభినయం సొంతమైన కాజల్ కు వెండితెరపై ఫుల్ డిమాండ్ ఉంది. తాజగా కాజోల్ నటించిన ‘ది ట్రైల్’ అనే వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ కాజోల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రాజకీయ నాయకుల గురించి కాజోల్ మాట్లాడటంపై కొందరు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రాజకీయ నాయకులకు సరైన చదువు లేదంటూ కాజోల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి కారణమైంది.
మన దేశంలో మార్పు చాలా నెమ్మదిగా జరుగుతోంది. ఎందుకంటే మనం మన సంప్రదాయాలకు కట్టుబడి ఉన్నాం. చదువుతోనే మార్పు రావాలని కాజోల్ అన్నారు. ఇక్కడ వరకు మాట్లాడి ఊరుకుంటే ఇంత గొడవ జరిగేది కాదు. అనంతరం రాజకీయాల గురించి మాట్లాడుతూ.. ‘‘సరిగ్గా చదువుకోని రాజకీయ నాయకులు మనకున్నారు. క్షమించండి నేను ఇలా చెబుతున్నాను. సరైన దార్శనికత లేని మనుషులు మనల్ని పాలిస్తున్నారు. విద్యావంతులైతే వేరే కోణంలో చూడొచ్చు’ అని కాజోల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.
కాజోల్ ప్రకటనపై కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాజోల్ చదువు మధ్యలోనే మానేసింది. ఆమె భర్త అజయ్ దేవగన్ గురించి కూడా కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేశారు. మరికొందరు కాజోల్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. కాజోల్ వద్ద నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ లేదు. ప్రజలకు బూటకపు హామీలు ఇవ్వదంటూ అభిమానులు మద్దతు పలికారు.
అయితే కాజోల్ ఇదే విషయంపై స్పందిస్తూ విద్య, దాని ప్రాముఖ్యత గురించి అనే ఒక పాయింట్ మాత్రమే చేశానని.. తన ఉద్దేశ్యం ఏ రాజకీయ నాయకులను కించపరచడం కాదని వివరణ ఇచ్చింది. అంతేకాదు దేశాన్ని సరైన మార్గంలో నడిపించే కొంతమంది గొప్ప నాయకులు మనకు ఉన్నారని కాజోల్ తన వ్యాఖ్యలను సవరించుకునే ప్రయత్నం చేశారు.
I was merely making a point about education and its importance. My intention was not to demean any political leaders, we have some great leaders who are guiding the country on the right path.
— Kajol (@itsKajolD) July 8, 2023
మొత్తానికి వివాదం తర్వాత కాజోల్ క్లారిటీ ఇచ్చింది. తన ప్రకటన వెనుక ఆంతర్యాన్ని వివరించింది. ట్విట్టర్ వేదికగా కాజోల్ తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..