- Telugu News Photo Gallery Cinema photos Salman Khan Holding Cigarette while hosting Bigg Boss OTT 2 on Stage Goes Viral, Photo goes viral
Bigg Boss OTT 2: ‘బుద్ధుందా..?’ అంటూ సల్మాన్‌ఖాన్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు! షోలో అలా కనిపించడంతో ఫైర్..
పాపులర్ టీవీ షో బిగ్‌బాస్ ఓటీటీ 2కి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఓటీటీ వేదికగా ప్రసారమయ్యే ఈ షో రెండో సీజన్ ఇటీవల ప్రారంభమైంది..
Updated on: Jul 09, 2023 | 3:34 PM

పాపులర్ టీవీ షో బిగ్‌బాస్ ఓటీటీ 2కి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఓటీటీ వేదికగా ప్రసారమయ్యే ఈ షో రెండో సీజన్ ఇటీవల ప్రారంభమైంది.

తాజాగా శనివారం ప్రసారమైన వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో సల్లూ భాయ్ చేతిలో సిగరెట్‌తో కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైగా హౌస్‌లో ఉన్న సెలబ్రిటీల తప్పొప్పులపై విశ్లేషణ చేస్తూ.. పలువురికి కౌంటర్లు కూడా వేశారు.

హౌస్‌లో కంటెస్టెంట్స్‌తో మాట్లాడేటప్పుడు సల్మాన్ సిగరెట్ కాల్చాడంటూ పలువురు తిట్టిపోస్తున్నారు. సంస్కృతి, నైతికత గురించి ఎదుటి వారికి నీతులు చెప్పే ముందు మనం పాటించాలనే విషయం సల్మాన్ తెలుసుకోవాలంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు.

పైగా ఈ సెలబ్రెటీ రియాల్టీ షోలో కుటుంబ విలువల గురించి సల్మాన్ చేసిన వ్యాఖ్యాలు చివరికి చిక్కులపాలు చేసింది. కెమెరా ముందుకు వచ్చేముందు ఇలాంటివి చేయకూడదని తెలియదా?, మీలాంటి వాళ్లే ఇలా పబ్లిక్‌గా సిగరెట్ కాలిస్తే చూసేవాళ్లు ఏం నేర్చుకుంటారంటూ తిట్టిపోస్తున్నారు.

కాగా బిగ్‌బాస్ రియాల్టీ షో బాలీవుడ్, టాలీవుడ్‌తోపాటు పలు భాషల్లో హిట్ షోగా నిలిచిన సంగతి తెలిసిందే.





























