Avinash: శుభవార్త చెప్పిన జబర్దస్త్ అవినాష్‌.. త్వరలో అమ్మానాన్నలుగా ప్రమోషన్‌.. ఇద్దరం ముగ్గురవుతున్నామంటూ..

ప్రముఖ కమెడియన్‌, జబర్దస్త్ ఫేమ్‌ ముక్కు అవినాష్‌ శుభవార్త చెప్పాడు. 2021 అక్టోబర్‌లో అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న అతను త్వరలోనే తండ్రిగా ప్రమోషన్‌ పొందనున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా తాము తల్లిదండ్రులం కాబోతున్నామని..

Avinash: శుభవార్త చెప్పిన జబర్దస్త్ అవినాష్‌.. త్వరలో అమ్మానాన్నలుగా ప్రమోషన్‌.. ఇద్దరం ముగ్గురవుతున్నామంటూ..
Avinash Family
Follow us
Basha Shek

|

Updated on: Jul 08, 2023 | 9:43 PM

ప్రముఖ కమెడియన్‌, జబర్దస్త్ ఫేమ్‌ ముక్కు అవినాష్‌ శుభవార్త చెప్పాడు. 2021 అక్టోబర్‌లో అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న అతను త్వరలోనే తండ్రిగా ప్రమోషన్‌ పొందనున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా తాము తల్లిదండ్రులం కాబోతున్నామని, ఇద్దరం ముగ్గురం కాబోతున్నామంటూ తన సంతోషాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుని మురిసిపోయాడు అవినాష్‌. దీంతో పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు అవినాష్‌- అనూజ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకన్న వాళ్లలో ముక్కు అవినాష్‌ ఒకరు. తనదైన కామెడీ పంచ్‌లు, ప్రాసలతో కంటెస్టెంట్‌గా మొదలై టీమ్‌ లీడర్‌ దాకా ఎదిగిపోయాడు. అదే క్రమంలో బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌లో అడుగుపెట్టి సెలబ్రిటీ షోను మరింత ఎంటర్‌టైన్‌ చేశాడు. బుల్లితెరతో పాటు కొన్ని సినిమాల్లో నటించిన జబర్దస్త్ కమెడియన్‌ 2021 అక్టోబర్‌లో అనూజను పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లి తర్వాత తన భార్యతో కలిసి పలు టీవీ రియాలిటీ షోల్లో పాల్గొన్నాడు ముక్కు అవినాష్‌. ప్రస్తుతం స్టార్‌ కమెడియన్‌గా బుల్లితెరను ఏలుతోన్న అతను యూట్యూబ్‌ ఛానెల్‌ వేదికగా గుడ్‌న్యూస్‌ చెప్పాడు. ‘నా భార్య అనూజ ప్రస్తుతం గర్బంతో ఉంది. తనకు ఇప్పుడు నాలుగో నెల. త్వరలోనే మా ఇంట్లోకి పాపాయి లేదా బాబు రాబోతున్నాడు. మా పెళ్లై ఏడాదిన్నరే అవుతోంది. అక్టోబర్‌లో మా పెళ్లి రోజు. చాలామంది పిల్లల్ని ఎప్పుడు కంటారు? అని ఎప్పటినుంచో అడుగుతున్నారు. ఇప్పుడు ఆ ప్రశ్నకు ఆన్సర్‌ చెబుతున్నాం. పెళ్లైన ఏడాదిన్నరకే మేం అమ్మానాన్నలు కాబోతుండడం హ్యాపీగా ఉంది. మూడు నెలల వరకు ఎవరికీ చెప్పొద్దని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఇప్పుడు నా భార్యకు నాలుగో నెల. అందుకే ఇప్పుడు చెబుతున్నాం. మా కంటే కూడా మా అమ్మానాన్న, అత్తామామాలు ఎంతో హ్యఫీగా ఫీలవుతున్నారు. నాలుగో నెలలో మా బిడ్డ గుండెచప్పుడు కూడా విన్నాం. అప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నాం’ అని ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు అవినాష్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.